తొక్కేయడానికి ఎన్టీఆర్ ఏమన్నా అరటి తొక్కా ఏంటి..? తాట తీసేస్తాం రేయ్..!

ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ పేరును బాగా ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. అవసరం ఉన్న అవసరం అవసరం లేకపోయినా ఎన్టీఆర్ పేరుని మధ్యలోకి లాగుతూ దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు కొందరు ఇడియట్స్. అయితే తాజాగా ఏపీ పొలిటికల్ ఇష్యూలో ఎన్టీఆర్ సైతం ఇరుక్కున్న విషయం తెలిసిందే . టిడిపి పార్టీకి అసలు సపోర్ట్ చేయలేదు ఎన్టీఆర్ . అలా అని మిగతా పార్టీలకు కూడా సపోర్ట్ చేయలేదు. తన పని తాను చూసుకుంటూ వెళ్ళాడు.. అయితే ఎన్టీఆర్ ఓటు వేయడానికి బ్లూ కలర్ షర్ట్ వేసుకొని వెళ్లడం అప్పట్లో సంచలనంగా మారింది. పరోక్షంగా వైసిపి పార్టీని సపోర్ట్ చేశారు అంటూ కొందరు తల తోకాలేని లాజిక్ తో ఆయనను ఇబ్బంది పెట్టారు .

అయితే టిడిపి ఘనవిజయం సాధించిన తర్వాత ఎన్టీఆర్ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ విష్ చేశారు. అంతేకాదు దానికి కూడా కొందరు జనాలు ట్రోల్ చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఈ ప్రేమ ఎక్కడికి పోయింది..? అంటూ ఆయనను నిలదీశారు. దీంతో ఊహించని చిక్కుల్లో ఇరుక్కున్నాడు ఎన్టీఆర్. పొలిటికల్ పరంగా అసలు తల దూర్చకూడదు అనుకున్న ఎన్టీఆర్ అసలు విష్ చేయడం పెద్ద మైనస్ గా మారిపోయింది .

అయితే ఇదే క్రమంలో ఆయన నటించబోయే దేవర సినిమా కూడా తెరపైకి వచ్చింది. దేవరను ఎక్కడ అడ్డుకుంటారో అన్న భయంతోనే ఎన్టీఆర్ ఈ విధంగా విష్ చేశాడు అంటూ పలువురు ట్రోల్ చేశారు. కొంతమంది ఏకంగా ఎన్టీఆర్ ను ఇండస్ట్రీలో తొక్కేయబోతుంది టిడిపి అధికారం అంటూ దారుణాతి దారుణంగా మాట్లాడారు . దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. ” తొక్కేస్తే తొక్కించుకోవడానికి ఎన్టీఆర్ ఏమన్నా అరటి తొక్క గ్లోబల్ పాన్ ఇండియా హీరో ఒక్కొక్కడికి తాట తీసేస్తాడు ..తన వైపు తప్పులేనంతవరకు ఎన్టీఆర్ ఎంత దూరమైనా వెళ్తాడు” అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆయనను ట్రోల్ చేసే వాళ్లపై రెచ్చిపోతున్నారు.