ఓరి దేవుడోయ్: చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో తెలుసా..?

కోట్లాదిమంది టీడీపీ శ్రేణులు అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ చూస్తున్న మూమెంట్ మరికొద్ది గంటల్లోనే రాబోతుంది . నాలుగవసారి ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాటను వినడానికి కోట్లాదిమంది టీడీపీ ప్రజలు శ్రేయోభిలాషులు ఫ్యాన్స్ కళ్ళల్లో వత్తులు వేసుకొని వెయిట్ చేస్తున్నారు . కాగా ఇదే మూమెంట్లో ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చే అతిధుల లిస్ట్.. అదే విధంగా అక్కడ హై సెక్యూరిటీ కి సంబంధించిన డీటెయిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

అంతేకాదు చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారోత్సవానికి పలువురు సెలబ్రిటీస్ తో పాటు బడాబడా మంత్రులు కూడా రాబోతున్నారట . మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ సైతం ఈ వేడుకకు రాబోతున్నట్లు సమాచారం అందుతుంది . అంతేకాకుండా కేంద్ర మంత్రులు కొందరు ఈ వేడుకకు హాజరు కాబోతున్నారట . టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మెగా పవర్ స్టార్ రాంచరణ్ – చిరంజీవి సైతం హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఎప్పుడు లేని విధంగా ఈసారి ప్రమాణస్వీకారోత్సవానికి కోట్లు ఖర్చు చేయబోతున్నారట ఏపీ గవర్నమెంట్ .

మరీ ముఖ్యంగా ఏపీలో కూటమి అధికారం చేపట్టబోతు ఉండడంతో వైసీపీని తుక్కుతుక్కుగా ఓడించిన ఆనందంలో పలువురు పార్టీ నేతలు శ్రేణులు ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని చాలా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి అని అదేవిధంగా ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే విధంగా చేయాలి అంటూ రకరకాలుగా ప్లాన్ చేసి.. ఫైనల్లీ బోయపాటి శ్రీను ప్లానింగ్ తో ఈ వేడుకను జరిపించబోతున్నారట. దీనికోసం కోట్లు ఖర్చు చేస్తున్నారట..!!