సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు ఈ విడాకుల సంఖ్యలు పెరిగిపోతూనే ఉంది.. తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. అది కూడా సినీ ఇండస్ట్రీకి చెందినవారు ఎప్పటికప్పుడు విడాకులు తీసుకుంటూ ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తున్నారు. అయుతే ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న మనస్పర్ధలతో కొంతకాలానికే డివోర్స్ తీసుకుని విడిపోతున్నారు. నాగచైతన్య, సమంత లాంటి టాప్ స్టార్ కపుల్ విడిపోవడంతో.. మిగతావారు అస్సలు ఆలోచించకుండా విడాకులకు సిద్ధమవుతున్నారు. తాజాగా హీరో ధనుష్ తో భార్య ఐశ్వర్య కు విడాకులైన సంగతి తెలిసిందే. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కూడా భారీ సైంధవిత డివోర్స్ తీసుకుని సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా మరో స్టార్ జంట విడాకులకు సిద్ధమయ్యారు. అతను మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ రాజ్ కుమార్ మనవడు.. నటుడు యువరాజ్ కుమార్. తన భార్యకు డివోర్స్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. రాజకుమార్‌కు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ ముగ్గురు కొడుకులు. రాఘవేంద్ర రాజ్ కుమారుడే ఈ యువరాజ్ కుమార్. యువరాజ్ మైసూర్ కు చెందిన శ్రీదేవి బైరప్పను ప్రేమించి 2019లో వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్ళై నాలుగేళ్లు పూర్తి కావస్తున్న క్రమంలో వీరు మనస్పర్ధలతో విడాకులకు సిద్ధమయ్యారు.
తనను శ్రీదేవి హింసించిందంటూ భార్య ఫై విడాకుల పిటిషన్ దాఖలా చేశాడు యువరాజ్. అంతేకాదు ఫ్యామిలీ కొర్ట్‌కు కూడా హాజరయ్యాడు. అందులో భాగంగా యువరాజ్ తరఫున న్యాయవాది శ్రీదేవి పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన క్లైంట్ భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల తనకు విడాకులు నోటీసులు పంపించినట్లు.. తనపై అమానుషంగా ఆమె ప్రవర్తించింది అంటూ ఆరోపణలు చేశాడు. అక్రమ సంబంధం బయటపడకుండా యువరాజ్ కు మరో నటితో అక్రమ సంబంధాన్ని అంటగట్టి ఆరోపణలు చేస్తుందంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయంపై యువరాజ్ భార్య శ్రీదేవి తన ఇన్స్టా వేదికగా స్పందించింది.
వృతి పరమైన అలంకారాన్ని కాపాడుకోవాల్సిన వ్యక్తి.. అందులో నిజం లేకుండా బహిరంగంగా ఓ మహిళను అవమానించేలా మాట్లాడడం నిజంగా దురదృష్టకరం. ఇది చాలా బాధాకరమైన ఘటన. గత కొన్ని నెలలుగా నేను అనుభవించిన అన్ని బాధలను బయట చెప్పకుండా కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు మౌనంగా ఉండిపోయా. కానీ నా గౌరవాన్ని, మానవత్వాన్ని ఏమాత్రం గౌరవించకుండా ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం బాధిస్తుంది. యువరాజ్‌కు ఒక నటితో అక్రమ సంబంధం ఉంది నిజం. న్యాయం తప్పకుండా గెలుస్తుందని నేను నమ్ముతున్న అంటూ శ్రీదేవి ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ గా మారుతుంది.