కొద్దిగంటలు ..మరికొద్ది గంటల్లోనే నాలుగవసారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు . ఈ క్రమంలోనే ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చే అతిధుల లిస్ట్ అదేవిధంగా ఏర్పాట్లకు సంబంధించిన డీటెయిల్స్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి . కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఏపీ సీఎం గా ప్రమాణస్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు మొత్తం ఈ వేడుకకు హాజరు కాబోతున్నారట .
అంతేకాదు నరేంద్ర మోడీతో పాటు పలువురు మంత్రులు కూడా ఈ వేడుకకు హాజరు కాబోతున్నారట . ఇప్పటికే హై సెక్యూరిటీ మొత్తం ఫిక్స్ చేశారట . అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ వేడుకకు హాజరు కాబోతున్నారట . అంతేకాదు చిరంజీవి కూడా ఈ వేడుకకు హాజరుకాబోతున్నట్లు తెలుస్తుంది . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఈ వార్తను ట్రెండ్ చేస్తున్నారు.
కాగా ఏపీ పొలిటికల్ హిస్టరీ లో గేమ్ చేంజర్ గా మారిన పవన్ కళ్యాణ్ ..వైసీపీని తుక్కుతుక్కుగా ఓడించి ఏపీలో కూటమి అధికారం చేపట్టే దిశగా ముందుకెళ్లారు. బాబాయ్ కోసమే అబ్బాయ్ రామ్ చరణ్ ఈ వేడుకకు హాజరు కాబోతున్నారట . రామ్ చరణ్ తో పాటు ఆయన సతీమణి ఉపాసన కూడా ఈ వేడుకకు హాజరు కాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. నిజానికి చిరంజీవి మొదట ఈ వేడుకకు హాజరు కాకూడదు అనుకున్నారట.. లాస్ట్ మినిట్ లో అటెండ్ అవ్వాలని ఫిక్స్ అయ్యారట. చూద్దాం మరి రేపు ఏం జరుగుతుందో..?