శ్రీ లీల.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే యంగెస్ట్ బ్యూటీ చాలా చాలా చిన్న ఏజ్ లోనే సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . ఎంతలా అంటే ఆమె అందానికి ఆమె నటనకి ఆమె ఆటిట్యూడ్ కి బడాబడా స్టార్ హీరోలు కూడా ఫిదా అయిపోయారు . మరి ముఖ్యంగా తనకంటే ఏజ్ లో పెద్ద హీరోలు కూడా ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం గమనార్హం. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో శ్రీలీలకి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. బాగా వైరల్ కూడా అవుతుంది .
శ్రీలీల తెలుగులో లాస్ట్ గా నటించిన సినిమా గుంటూరు కారం . ఈ సినిమాతో హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొంది ఈ అందాల ముద్దుగుమ్మ. ఎంతలా జనాలు చేత బూతులు తిట్టించుకుందో అందరికీ తెలిసిందే. కాగా రీసెంట్గా తెలుగులో ఒక సినిమాకి కమిట్ అయింది శ్రీ లీల . సామజవరగమన సినిమాతో రచయితగా పాపులారిటీ సంపాదించుకున్న భాను బొగ్గవరపు దర్శకుడుగా పరిచయం అవుతూ రవితేజతో తన 75వ సినిమాను తెరకెక్కించబోతున్నారు .
ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి . ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీల సెలెక్ట్ అయినట్లు అఫీషియల్ గా ప్రకటించేసింది చిత్ర బృందం . పూజా కార్యక్రమాల కోసం శ్రీ లీల రాగ రవితేజను చూసిన వెంటనే హగ్ చేసుకునింది. సాధారణంగా ఏ హీరోయిన్ అయినా సరే పెద్ద హీరోస్ ని చూస్తే నమస్కరిస్తుంది. అయితే హీరోయిన్ శ్రీలీల మాత్రం వెంటనే చాలా చనువుగా రవితేజను హగ్ చేసుకోవడం ఆయన కూడా అంతే చనువుగా శ్రీలీలతో మాట్లాడడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కి ఇదే నిదర్శనం అంటున్నారు ఫ్యాన్స్..!!
Gear up for an ultimate mass entertainer! 🔥🤙🏻
𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐉𝐀 @RaviTeja_offl ~ #RT75 Launched officially with a pooja ceremony today! 💫✨
Shoot begins from Today! 🔥
A Sankranthi 2025 Release. 🥳@sreeleela14 @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo… pic.twitter.com/V6scL2SK01
— Sithara Entertainments (@SitharaEnts) June 11, 2024