అక్టోబర్ లో పెరిగిపోతున్న మూవీ ట్రాఫిక్.. నేనంటే నేనంటూ పోటీ పడుతున్న స్టార్ హీరోస్..?!

నిన్న మొన్నటి వరకు అక్టోబర్ నెల అనగానే కేవలం దేవర సినిమా మాత్రమే అందరికి స్ట్రైక్ అయ్యేది. అయితే తాజాగా అక్టోబర్ నెల సినిమాల బరిలో పోటీ మరింతగా పెరిగింది. స్టార్ హీరోస్ నేను వస్తానంటే నేనొస్తానంటే అక్టోబర్ నెల కోసం పోటీ పడుతున్నారు. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతున్న దేవర సినిమా తుది ద‌శ‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజ‌ర్ సినిమా తుదిమెరుపులు దిద్దుకుంటుంది.. ఈ సినిమా కూడా అక్టోబర్ లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

Ram Charan Game Changer on NTR Devara date?

దీంతో రాంచరణ్ కూడా అక్టోబర్ లోనే పోటీకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక వీరిద్దరితో పాటే కోలీవుడ్ తలైవార్ రజనీకాంత్ తన సినిమాను కూడా అక్టోబర్ లో రిలీజ్ చేయనున్నట్టు డిక్లేర్ చేశాడు. జైలర్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో రజినీకాంత్ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాను అక్టోబర్ 10న‌ రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు మేక‌ర్స్‌.

Viduthalai 2 Shoot Delayed Due To Vijay Sethupathi's Hectic Schedule?- Republic World

ఇక ఈ ముగ్గురు స్టార్ హీరోస్ తో పాటు నేను రంగానికి సిద్ధమంటూ బరిలోకి దిగుతున్నాడు నటుడు విజయ్ సేతుపతి, మక్కుల్ సెల్వన్. గ‌తంలో విడుదలై పార్ట్ వన్ వ‌చ్చి సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్ గా తెరకెక్కనున్న విడుదలై 2 అక్టోబర్లో రిలీజ్ చేయనున్నారని మేకర్స్ ప్రకటించారు. ఇలా ఇప్పటికే అక్టోబర్ కి ఫిక్స్ అయిన సినిమాలు ఇవి. ఇంకా ముందు ముందు మరిన్ని సినిమాలు అక్టోబర్ బ‌రిలో రిలీజ్ కు ప్లాన్ చేస్తారో వేచి చూడాలి.