నాలుగేళ్ల బాలిక అత్యాచార ఘటనలో దృశ్యం యాక్టర్ అరెస్ట్.. వీడు ఇంత దుర్మార్గుడా..?!

ప్రస్తుతం ఉన్న సమాజంలో రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా దారుణంగా ప్రవర్తిస్తూ మృగాలుగా మారుతున్నారు కామాంధులు. కొందరు అభం, శుభం తెలియని పసికందులపై కూడా అమానుషంగా అత్యాచారానికి పాల్పడి వారిపై మాయని మచ్చలు వేస్తున్నారు. వారి జీవితాలతో ఆడుకోవడమే కాదు.. ఆదిలోనే ఆడదాని జీవితాన్ని ముగించేస్తున్నారు. మహిళలు, చిన్నపిల్లల కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన కామాంధుల నుంచి వారిని తప్పించలేకపోతున్నారు. ప్రస్తుతం ఇదే కోవాలో ఓ మ‌ళ‌యాళ న‌టుడు పేరు మారుమోగిపోతుంది. ఏకంగా అభం,శుభం తెలియని నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించిన వివరాలు ఒకసారి తెలుసుకుందాం.

Drishyam Actor Kootickal Jayachandran Accused Of Sexually Assaulting  4-Year-Old Girl In Kerala

దృశ్యం సినిమాలో విలన్ పాత్రలో నటించిన మలయాళ యాక్టర్ కుట్టికల్‌ జయచంద్రన్ నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు బాధితురాలు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేస్‌ దర్యాప్తు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్టు మళ‌యాల‌ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. కాలకృత్యాలు తీర్చుకోవడానికి చిన్నారి బయటకు వెళ్ళి ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో మేమంతా భయపడ్డామని.. అయితే కాసేపటికి తాను చాలా బలహీనంగా, నీరసంగా ఉండటమే కాకుండా.. చిరిగిపోయిన దుస్తులు, శరీరం నిండా దుమ్ముతో ఇంటికి వచ్చిందని.. అది చూసిన మేము చాలా భయపడిపోయాం అంటూ వివరించారు.

Jayachandran booked for sexually assaulting a minor - The South First

తర్వాత ఏం జరిగిందో పాపను అడగ‌గా తను చెప్పిన దాన్ని బట్టి పాపపై లైంగిక దాడి జరిగిందని సమాచారం. మీరు చెప్పిన దాన్ని బట్టి కోచికూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు చేసి నటుడు పై దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు పోలీసులు. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఆదేశాల మేరకు ఆ పాప నుంచి వాంగ్మూలం తీసుకొని కేసు నమోదు చేసి నటుడిని అరెస్ట్ చేశారంటూ మలయాళ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. అయితే ఆయన సాన్నిహిత్య వర్గాలు మాత్రం నటుడు ఇంకా అరెస్ట్ కాలేదని.. దానికి రుజువులు లేవంటూ చెబుతున్నాయి. అయితే వాళ్ళు న‌టుడైనా, ఎలాంటి వాడైనా.. ఇలాంటి దారుణమైన పనికి వడికట్టినప్పుడు ఖచ్చితంగా శిక్షించాలని.. ఇలాంటి దుర్మార్గులపై ఇకనైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని జ‌నం అర్ధిస్తున్నారు.