‘ కల్కి 2898 AD ‘ ట్రైలర్ రివ్యూ.. వార్ వారిద్దరి మధ్య స్టోరీ రివ్యూ చేసిన నాగ్ అశ్విన్..?!

అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా మోస్ట్ ఎవైటెడ్‌ మూవీ కల్కి 2898 ఏడీ.. ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ట్రైలర్ ఎలా ఉంది.. అంచనాలు అందుకుందా.. లేదా.. ఒకసారి చూద్దాం. కల్కి ట్రైలర్ పై ఆసక్తి పెరగడానికి కారణం ఈ సినిమా గురించి ఆడియన్స్‌లో కొద్దిగ కూడా అవగాహన లేకపోవడం. ఒక్కో పాత్రను పరిచయం చేశారు తప్ప.. పాత్రల మధ్యన సంబంధం ఎలా ఉంటుంది.. అలాగే మధ్యలో బుజ్జి క్యారెక్టర్‌ను ఇంట్ర‌డ్యూస్‌ చేసి కన్ఫ్యూజ్ చేశారు. ఈ సినిమాల్లో ప్రభాస్ భైరవ రోల్ ప్లే చేశాడు. భైరవ ఫ్రెండ్ గా బుజ్జి కనిపించనుంది. బుజ్జి ఒక కార్. ప్రభాస్ సాహ‌సోపేత ప్రయాణంలో అది ఎప్పుడు ఆయనకు తోడుగా ఉంది. బుజ్జి కేంద్రంగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేక‌ర్స్.

Kalki 2898 AD: Prabhas' sidekick Bujji's 'body' introduced with new teaser  at an event. Watch - Hindustan Times

కనుక కల్కి సినిమా ఎలా ఉంటుందనేది ట్రైలర్ చూస్తే కానీ అవగాహన రాదని ఫిక్స్ అయ్యారు ప్రేక్షకులు. జూన్ 10న వరల్డ్ వైడ్ గా కల్కి ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఆడియన్స్ ఫిదా అయ్యే విధంగా ఈ ట్రైలర్‌తో కల్కి కథపై హింట్ ఇచ్చాడు నాగ అశ్విన్. కథ విషయానికి వస్తే విశ్వంలో కాంప్లెక్స్ అనే యాస్ ప్రపంచం ఉంటుంది. దానికి చేరుకోవాలంటే వన్ మిలియన్ యూనిట్స్ ఉండాలి,, యూనిట్స్ అంటే మన భాషలో డబ్బులు లాగా. ఆ యూనిట్ల కోసం బైరవ(ప్ర‌భాస్‌) కష్టపడుతూ ఉంటాడు.. కాంప్లెక్స్‌కు వెళాల‌ని క‌ల‌లు కంటూ ఉంటాడు. అదే టైంలో యూస్ కి ప‌ద్మ (దీపిక పదుకొనే) అవసరం ఉంది.

Kalki 2898 AD Trailer Reaction: Netizens Are Mighty Impressed With Prabhas,  Amitabh Bachchan and Deepika Padukone's Upcoming Sci-Fi, Call It 'New Era  of Indian Cinema' | 🎥 LatestLY

పద్మ కడుపులో బిడ్డ పెరుగుతుంది. ఆ బిడ్డకు రక్షణగా అశ్వద్ధామ (అమితాబచ్చన్) ఉంటాడు. ఇక పద్మను తెచ్చి ఇస్తే కాంప్లెక్స్ కు పంపిస్తానని భైరవకు ఆఫర్ ఇస్తాడు య‌స్‌. అలా భైరవ, అశ్వద్ధామ మధ్య జరిగే యుద్ధమే సినిమా. ట్రైలర్ ప్రకారం ఈ మూవీ విజువల్స్ హాలీవుడ్ మూవీకి ఏమాత్రం తగ్గకుండా తెర‌కెక్కించిన‌ట్లు తెలుస్తుంది. నాగ అశ్విన్ బలమైన పాత్రలు, కాస్ట్యుమ్‌, మేకప్ కృత్రిమంగా కాకుండా న్యాచుర‌ల్‌గా ఉండేలా ప్లాన్ చేశాడు. సినిమాలో బలమైన కథ ఉన్నట్లు అనిపిస్తోంది. ఆడియన్స్ కు సినిమా కనెక్ట్ అయితే మాత్రం మరోసారి నాగ్ అశ్విన్‌ చరిత్ర సృష్టించడం ఖాయం. ఇక జూన్ 27న ఈ సినిమా రిలీజై మళ్ళీ నాగ్‌ అశ్విన్ మ్యాజిక్ రిపీట్ అవుతుందో లేదో చూడాలి.