డైరెక్టర్ వై.వి.ఎస్ చౌదరి భార్య ఓ సినిమాలో హీరోయిన్గా నటించిందా.. ఆ మూవీ ఏంటంటే..?!

తెలుగులో ఎప్పటికీ గుర్తుండిపోయే ఎన్నో సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. డైరెక్టర్ వైవిఎస్ చౌదరి ఒకప్పుడు మంచి క్లాసికల్ సినిమాల్లో అందించిన ఈయన తరువాత వరుస ఫ్లాప్లు రావడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఒకప్పుడు ఇండస్ట్రీలో వైవిఎస్ చౌదరి అంటే ఇండస్ట్రీలోనే పెద్ద పర్సనాలిటీ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వైవిఎస్.. రచయితగా, దర్శకుడిగా, ఎగ్జిబిటర్గా, ఆడియో కంపెనీ అధినేతగా తన సత్తా చాటుకున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో సినిమాల్లోనే ఏదైనా సాధించాలని ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు వైవిఎస్ చౌదరి. వాళ్ళ సినిమాలు అసిస్టెంట్ దర్శకుడుగా వ్యవహరించిన ఈయన 1999లో నాగార్జున ప్రొడ్యూసర్ గా శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి సినిమా ద్వారా డైరెక్టర్ గా మారాడు.

Tollywood: YVS చౌదరి భార్య ఒకప్పుడు హీరోయిన్.. ఏ సినిమాల్లో నటించిందంటే..?  - Telugu News | Do you know yvs chowdary wife Geetha Once A heroine Know  What Movies She acted | TV9 Telugu

ఆ సినిమాకు మంచి సక్సెస్ రావడంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు లాంటి సినిమాలు ఆయనకు భారీ పాపులారిటి తెచ్చిపెట్టాయి. నందమూరి హరికృష్ణ ఆయన కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అభిమానులకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. వీరిద్దరి కాంబో బ్లాక్ బస్టర్ కాంబోగా నిలిచింది. ఇక ఓ 40 ఏళ్ళు పైబడిన హీరోని నందమూరి కుటుంబం తాలూకా లెగసిని ఒక లైన్ పై నిలబెట్టిన ఆయన బ్లాక్ బస్టర్ వండర్స్‌ని క్రియేట్ చేశాడు. అయితే సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయినే వైవిఎస్ చౌదరి ప్రేమించి వివాహం చేసుకున్నాడని చాలామందికి తెలియదు. వైవిఎస్ చౌదరి సతీమణి గీత ఓ సినిమాలో నటించింది.

YVS Chowdary's New Talent Roars

ఆమె నాగార్జున నటించిన బ్లాక్ బస్టర్ మూవీ నిన్నే పెళ్ళాడుతాలో హీరో చెల్లెలుగా ఆకట్టుకుంది. ఆ తర్వాత మాస్ మహారాజ్ నటించిన సింధూరం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మెప్పించింది. అలాగే పలు సినిమాల్లో మంచి పాత్రల్లో ఆకట్టుకున్న గీత.. నిన్నే పెళ్లాడుతా మూవీ టైంలో చౌదరి డైరెక్షన్లో పనిచేసింది. ఆ టైంలో ఇద్దరి మధ్యలో పరిచయం ఏర్పడడం పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరు కులాలు వేరైనా పెద్ద అభ్యంతరం చెప్పినా వారిని ఒప్పించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇక దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత దివంగత నందమూరి హరికృష్ణ మనవడు, దివంగత జానకిరామ్ తనయుడు తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ సినిమా తీయబోతున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చాడు వైవిఎస్ చౌదరి.