ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి.. బాలయ్య బర్త్డే రోజే ఏపీలో మొదటి అన్న క్యాంటీన్ స్టార్ట్..!!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ 64వ‌ పుట్టినరోజు నిన్న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే బాలయ్య హిందూపురం నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా సక్సెస్ సాధించాడు. ఓ పక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో ఫుల్ జోష్లో దూసుకు వెళ్తున్న బాలయ్యకు ఆయన అభిమానులు మాత్రమే కాదు, సినీ, రాజకీయ, రంగాలకు చెందిన వారందరూ విషెస్ తెలియజేశారు. గతంలో ఎక్కువ హైదరాబాద్‌లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటూ ఉండే బాలయ్య ఈసారి ఇంట్రెస్టింగా తను పోటీ చేసి గెలిచిన హిందూపురంలోనే పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నాడు.

అయితే ఇక్కడే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. 2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి.. 2019లో ఎన్నికలకు కొద్ది నెలల ముందే రాష్ట్రం వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ఏర్పాట్లు చేసింది. అయితే గత ప్రభుత్వం వాటిని కొనసాగించలేక ఆపేసింది. ఈ క్రమంలో అన్న క్యాంటీన్ పూన్హ‌ ప్రారంభిస్తామంటూ కూటమి సభ్యులు వెల్లడించారు.

ఇక తాజాగా ఆ మాటను నిలబెట్టుకున్న కూటమి సభ్యులు. నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మొదటి అన్న క్యాంటీన్ హిందూపురంలో పున ప్రారంభ‌మైంది. త్వ‌ర‌లోనే మిగ‌తా అన్నా క్యాన్టీన్‌లు కూడా ప్రారంభించ‌నున్నార‌ని తెలుస్తుంది. దీంతో ప్రమాణ స్వీకారం కాకముందే బాలయ్య తన హామీలను నిలబెట్టుకోవడం ప్రారంభించారంటూ.. ఇది బాలయ్య మాట అంటే అంటూ.. బాలయ్య చెప్పిన మాట ఎప్పటికీ తప్పడంటూ.. అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.