వాటిని పెంచే సర్జరీ చేయించుకోమని బలవంతం చేశారు.. సమీరా రెడ్డి షాకింగ్ కామెంట్స్..?!

బాలీవుడ్‌లో చాలామంది సెలబ్రిటీస్ రూపు రేక‌లు మారడం చూసి షాక్ అవుతూ ఉంటారు.. ఒకప్పుడు చాలా నార్మల్ గా కనిపించే తమ అభిమాన బ్యూటీ లుక్ నుంచి బాడీ షేప్ ఎంత పర్ఫెక్ట్ గా ఉండేది.. కానీ ఇప్పుడు ఏంటి ఇంతలా చేంజ్ అయ్యింది అని కామెంట్స్ చేసిన సందర్భాలు కూడా నటులను ఇబ్బంది పెడతాయి. దీంతో కొందరు సర్జరీలు కూడా చేయించుకున్న సంఘటనలు ఉన్నాయి. ఫిల్లర్ల నుంచి సీట్ సర్జరీ వరకు నోస్ జాబ్, లిప్ జాబ్ ఇలా ఎన్నో రకాలుగా తమ అందాన్ని పెంచుకునేందుకు ఫిల్లర్స్ ఆశ్రయించిన వారు ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా చాలామంది ఒప్పుకున్నారు కూడా.

Sameera Reddy - Happiness & Confidence are the prettiest... | Facebook

అయితే ఎవరెని సలహాలు ఇచ్చిన తమ సహజమైన శరీరానికి కత్తిగాట్లు అంటనివ్వకుండా.. ఉన్నదానితోనే సరిపెట్టుకున్న వారు ఉన్నారు. వారిలో నటి సమీరా రెడ్డి ఒకటి. ఇటీవల ఈ అమ్మడు మాట్లాడుతూ పరిశ్రమల తన కెరీర్ పిక్స్ లో ఉన్న టైంలో బ్రెస్ట్ సైజు పెంచుకోమని బ్రెస్ట్ అన్లార్జ్ చేసుకునే సర్జరీ చేయించుకోమని ఎన్నోసార్లు ఒత్తిళ్లు వచ్చాయని.. హిందుస్తాన్ టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించింది. తను మాట్లాడుతూ స్టార్ నటిగా పీక్స్ లో కెరీర్ ఉన్న సమయంలో శ‌స్త్ర చికిత్స చేయించుకోమని నాపై ఎంత ప్రెషర్ పట్టారో నేను చెప్పలేనని ఆమె వివ‌రించింది.

Sameera Reddy says she loves flaunting her flabs wasn't confident enough  when she was skinny : Bollywood News - Bollywood Hungama

చాలామంది సమీరా ఇలాంటి సర్జరీలు అందరూ చేయించుకుంటున్నారు.. నువ్వేం స్పెషల్ కాదు అన్నారని.. కానీ నేను ఇలాంటివి ఇష్టపడలేదు.. అయితే ప్లాస్టిక్ సర్జరీ, బోటేక్స్‌ చేయించుకోవాలనుకునేవ్వరిని నేను తప్పు పట్టలేను.. కానీ నేను అలా చేయించుకోవాలనుకోలేదు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. నా చర్మం చెడుగా ఉన్న నేను దానిని చూపిస్తా.. నా సెల్యులైట్, నా బరువును చూపిస్తా.. నేను ఖచ్చితమైన 36 – 24 – 36 ఫిగర్ కంటే ఇలా కనిపించడానికి ఇష్టపడతా అంటూ ఆమె వివరించింది. ప్రస్తుతం సమీరా రెడ్డి చేసిన కామెంట్స్‌ వైరల్ అవ్వడంతో వామ్మో హీరోయిన్గా ఎదిగిన త‌ర్వాత కూడా ఇలాంటి ఒత్తిళ‌ను భరించాల్సి ఉంటుందా అంటూ షాక్ అవుతున్నారు నెటిజన్స్.