వాట్.. నయనతారను ఆ డైరెక్టర్ అందరూ ముందే డ్రెస్ చేంజ్ చేసుకోమంటూ అవమానించాడా.. అతను ఎవరంటే..?!

సౌత్ స్టార్ బ్యూటీ నయన్‌కు ఉన్న ఫ్యాన్ బేస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో మరింత పాపులారి దక్కించుకున్న నయన్.. చివరిగా అన్నపూర్ణి సినిమాతో వెండి తెరపై మెరిసింది. తన 75వ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ఊహించిన రెంజ్‌లో సక్సెస్ అందుకోలేదు. అయితే ఈ సినిమా కంటే ముందు నయన్‌ నటించిన జవాన్ మొదటి బాలీవుడ్ సినిమా అయినప్పటికీ.. అమ్మడు ఈ మూవీలో త‌న న‌ట‌న‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్‌ను దక్కించుకుంది. ఈ నేపద్యంలో నయన్ నెక్స్ట్ బాలీవుడ్ మూవీ ఏంటో అనే అంశంపై ప్రేక్షకుల ఆసక్తి మొదలైంది. ఇక మ‌న్నంగ‌టి, టెస్ట్ సినిమాల్లో బిజీగా గ‌డుతుంది.

Ghajini director responds to Nayanthara saying that she regrets doing the  film : Bollywood News - Bollywood Hungama

వరుస‌ సినిమాలో నటిస్తూ భారీ పాపులారిటి దక్కించుకున్న నయన్‌కు లేడీస్ సూపర్ స్టార్‌గా బిరుదు దక్కిన సంగతి తెలిసిందే. ఇక నామ్ రౌడితాన్ సినిమాలో నటిస్తున్న సమయంలో డైరెక్టర్ విగ్నేష్ శివన్‌తో ప్రేమలో పడిన ఈ అమ్మడు పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. పెళ్లయిన తర్వాత కూడా నయన్‌ సినిమాలో చేస్తూ మరోవైపు ఫ్యామిలీకి సరైన సమయాన్ని కేటాయిస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ప్రముఖ జర్నలిస్టు మాట్లాడుతూ నయన్.. గజినీలో నటించినప్పుడు ఆమెకు జరిగిన షాకింగ్ సంఘటనను వివరించాడు. ఆ జర్నలిస్టు మాట్లాడుతూ చెన్నై వైఎంసిఏ గ్రౌండ్ లో గజినీ సినిమాలో నయనతారను విలన్లను వెంబడించే సీన్ షూట్ చేస్తున్నారు.. ఆ సీన్ లో నయన్ పరిగెడుతున్న సమయంలో మురుగదాస్ కట్ చెప్పాడు.

నయ‌న్‌ ధరించిన చొక్కా వల్ల‌ సీన్ చాలా అసభ్యంగా కనిపిస్తుంది.. అది చూసిన మురుగదాస్ వెంటనే ఈ షర్ట్ చాలా అసభ్యకరంగా ఉంది.. నేను షూట్ తీయలేను. మరో షర్ట్ వేసుకో అని చెప్పాడని.. అయితే నయన్‌కు వేరే చొక్కా లేకపోవడంతో.. చివరి క్షణంలో ఇలా ఎందుకు చెబుతున్నారు.. నేను వేరే బట్టలు కూడా తేలేదు, కనీసం మార్చుకోవడానికి క్యారవాన్‌ కూడా లేదంటూ వివరించిందట. వెంటనే మురగదాస్ అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్లి ఫ్లాట్ఫారంపై ఓ ష‌ర్ట్‌ కనుక్కొని వచ్చి ఇచ్చాడని.. తర్వాత నయన్ క్యార‌వాన్‌ లేకపోవడంతో అక్కడ పార్క్ చేసిన ఓ కార్‌ వెనకకు వెళ్లి క్లోసెట్లో నిలబడి షర్ట్ వేసుకుందని వివరించాడు. ప్రస్తుతం ఆయన చేసినక కామెంట్స్‌ వైరల్ అవ్వడంతో మురగదాస్ షర్ట్ అసభ్యకరంగా ఉందని కేవలం ఒక సన్నివేశం కోసం ఇంతలా నయన్ ను ఇబ్బంది పెట్టాడా అంటూ ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్‌.