“యస్..ఆ మాట అన్నది నేనే..సో వాట్..?”.. విజయ్ సేతుపతి ఇచ్చిపడేశాడుగా..!

విజయ్ సేతుపతి .. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాడు.. ఎవరికైనా సరే భయపడడు . తప్పు చేస్తేనే ఆయన వెనకడుగు వేస్తారు .. ఆయన అసలు తప్పే చేయడు అంటున్నారు ఆయన అభిమానులు. తాజాగా విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ మూవీ మహారాజా. శుక్రవారం ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతుంది. నితిన్ స్వామినాథన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది . ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించారు విజయ్ సేతుపతి.

ఇదే క్రమంలో తెలుగులో ఆయన నటించిన సినిమాలకు సంబంధించిన విషయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఇదే క్రమంలో ఆయన గతంలో కృతశెట్టిని రిజెక్ట్ చేసిన విషయంపై కూడా ప్రశ్నించారు రిపోర్టర్స్ . అయితే దానికి విజయసేతుపతి ఓపెన్ గానే ఆన్సర్ ఇచ్చారు. “యస్, రిజెక్ట్ చేసింది నేనే.. ఆమెతో ఆల్రెడీ తండ్రి పాత్రలో ఒక సినిమా చేశాను ..మరి ఆమెతో వెంటనే మరొక మూవీలో రొమాన్స్ చేయమంటే ఎలా ..? ఆ సినిమా చేస్తున్న టైంలో కృతశెట్టి నాతో నటించడానికి ఇబ్బంది పడింది”..

” నేనే చెప్పాను నన్ను తండ్రిగా ఫీల్ అవ్వు అని చెప్పా.. మరి అలాంటి నేనే పక్క సినిమాలో ఆమెతో రొమాన్స్ ఎలా చేయగలను ..? నేను ఆ సినిమాలో నటించింది కేవలం బుచ్చిబాబు కోసం మాత్రమే “అంటూ తెగేసి చెప్పేసాడు. నేనే కాదు కృతి శెట్టి కూడా నాతో నటించడానికి సిద్ధంగా ఉండి ఉండదు.. ఆ విషయం నాకు తెలుసు అంటూ క్లారిటీగా చెప్పేశారు. దీంతో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి..!!