పూర్తి ఆరోగ్యంగా ఉన్న మనిషి..రోజుకు ఎన్నిసార్లు వాష్ రూమ్ వెళ్తాడో తెలుసా..?

పెరిగిపోతున్న టెక్నాలజీకి మారిపోతున్న కాలానికి రేడియేషన్ ఎక్కువగా పెరిగిపోయి యంగ్ ఏజ్ లోనే.. ఎలాంటి రోగాలకు గురవుతున్నారో మనం చూస్తూనే ఉన్నాము. పట్టుమంటూ 25 ఏళ్లు దాటగానే బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి . మరీ ముఖ్యంగా చైనీస్ ఫుడ్ కు అలవాటు పడిన యువత రోగాలను కొని తెచ్చుకుంటున్నారు . అయితే ఇలాంటి క్రమంలోనే.. అసలు మనం ఆరోగ్యకరంగా ఉన్నామా..? లేదా ..? అని చెప్పే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఒక మనిషి ఎన్నిసార్లు మూత్రంకి వెళ్లారు అనేదాన్ని బట్టి కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా ..?సమస్యలు ఉన్న విషయం తెలిసిపోతుంది.

*నిజానికి ఒక వ్యక్తి రెండు లీటర్ల నుంచి నాలుగు లీటర్లు తాగితే ఏడు సార్లు మూత్ర విసర్జన చేస్తాడట . నాలుగు సార్లు కన్నా తక్కువగా లేక 11 సార్లు కన్నా ఎక్కువగా వస్తే డాక్టర్లను కలవడం చాలా చాలా మంచిది అంటున్నారు

*మరి ముఖ్యంగా మూత్రం రంగు మారిపోతూ ఉంటే డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది అంటున్నారు నిపుణులు.

*మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోకూడదు దానివల్ల మూత్రశయం ఇన్ఫెక్షన్లు కిడ్నీలో స్టోన్స్ వస్తాయట

*ఆరోగ్యంగా ఉన్న మనిషి మూత్రం పసుపు లేదా తెలుపు కలగలిపిన రంగులో మాత్రమే ఉంటుందట. ఆ రంగు మారితే కచ్చితంగా ఆ వ్యక్తికి ఏదో రోగం ఉన్నట్లే ..

*వయసు మీద పడే కొద్ది మూత్ర విసర్జనకు తరచూ వెళ్లాల్సి ఉంటుంది.

* ప్రెగ్నెన్సీ టైంలో ..డయాబెటిస్ పేషెంట్ ఎక్కువగా మూత్రం వెళ్తూ ఉంటారు ..

*జంక్ ఫుడ్ తిన్నప్పుడు మూత్రం వాసన చాలా డిఫరెంట్ గా వస్తుందట

*సాధారణంగా మూత్ర విసర్జన వ్యవధి ఏడు నుంచి పది సెకండ్లు మాత్రమే ఉంటుందట .. ఎక్కువగా మూత్ర విసర్జన సమయం పెరిగితే డాక్టర్ను సంప్రదించడం ఉత్తమం అంటున్నారు నిపుణులు..!!