మెగా ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్.. ఏం లక్ రా బాబు వీళ్లది..!!

ప్రజెంట్ మెగా ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా క్లీం కార పుట్టిన తరువాత మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చింది. మెగా ఫ్యామిలీ నుంచి బ్యాక్ టు బ్యాక్ వరుసగా గుడ్ న్యూస్లే వింటూ వస్తున్నాం. మొదటగా వరుణ్ తేజ్ పెళ్లి ..ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్.. ఆ తర్వాత సురేఖ గారు అత్తమ్మ కిచెన్ అంటూ కొత్త వ్యాపారం స్టార్ట్ చేయడం.. ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ స్థాయిలో గెలుపొందడం ఇప్పుడు మినిస్టర్ కాబోతూ ఉండడం బ్యాక్ టు బ్యాక్ వరుసగా అన్ని గుడ్ న్యూస్ లో వినిపిస్తూ వచ్చారు.

తాజాగా సోషల్ మీడియాలో మరొక మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్త వైరల్ గా మారింది. గ్లోబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ తో మనం ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు దిల్ రాజు. బాలీవుడ్ హాట్ బ్యూటీ కియరా అద్వానీ ఈ సినిమాలో నటిస్తున్నారు . పొలిటికల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో పాన్ ఇండియా లెవెల్ లో ఈ మూవీ రాబోతుంది .

ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిరింది . ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నాడట . తండ్రి కొడుకు పాత్రలో నటించి మెప్పించబోతున్నాడట. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రీ రోల్ లో రాంచరణ్ ఇరగదీసేసినట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది . అప్పన్న అనే పాత్రలో గ్రామీణ ప్రాంతంలో నివసించే వ్యక్తిగా పంచకట్టుతో చాలా నాచురల్ లుక్స్ లో కనిపిస్తాడట. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!