బాలయ్య బర్త డే స్పెషల్: ఆయన టోటల్ ఆస్తి ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా..?

స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య నందమూరి నట సిం హం అంటూ అభిమానులు చేత పిలిపించుకుంటున్నాడు ..శభాష్ అంటూ ఎంతో మంది చేత ప్రశంసలు దక్కించుకుంటున్నారు . మరీ ముఖ్యంగా హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి వరుసగా మూడోసారి సైతం విజయం అందుకొని తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు బాలయ్య . నేడు బాలయ్య పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాల గురించి జనాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . ఈ క్రమంలోనే కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు సైతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

మరీ ముఖ్యంగా బాలయ్య ఆస్తులకు సంబంధించిన డీటెయిల్స్ అఫ్ వైరల్ అవుతున్నాయి . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం సుమారు 3000 కోట్లు బాలయ్య ఆస్తులు ఉంటాయి అంటూ తెలుస్తుంది . ఇందులో తండ్రి ఎన్టీఆర్ నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయట . ఎన్టీఆర్ థియేటర్లు -హోటల్స్ – స్టూడియోలు ఇలా ఎన్నో కొన్నారు వీటితో పాటు వందల ఎకరాల ల్యాండ్లు కూడా ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికీ చెన్నైలో కోట్లు విలువ చేసే బంగ్లా ఉందట . అంతేకాదు హైదరాబాదులో రామకృష్ణ స్టూడియో కూడా ఉంది . ఇలా వారసత్వంగా బాలయ్యకు 100 కోట్లకు పైగాని ఆస్తులు వచ్చాయట .

ఇక బాలయ్యకు హైదరాబాదులో రెండు లగ్జరీయస్ బంగ్లాలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ లో చంద్రబాబు నాయుడు ఇంటి సమీపంలోనే ఒక లగ్జరీ హౌస్ అదే విధంగా ఇటీవల 35 కోట్లతో మరో ఇల్లు కూడా కొనుగోలు చేశారట . అంతేకాదు బాలయ్య దగ్గర లగ్జరీ కార్లు కూడా ఉన్నాయట . అయితే ఎంత ఆస్తి ఉన్నా సరే బాలయ్య చాలా సింపుల్ లుక్ లో కనిపించడానికి ఇష్టపడతారు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . బాలయ్యకి ఉన్న ఆస్తులకు ఎంతో లగ్జరీయస్ గా బతకచ్చు కానీ ఆయన చాలా సింపుల్ లైఫ్ స్టైల్ ని ఫాలో అవుతూ ఉంటారు .. బాలయ్య ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు . ఈ సినిమా షూట్ కంప్లీట్ అవ్వగానే బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు..!!