సమంత అభిమానులకు ఇది బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి . నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్థానాన్ని సంపాదించుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు ఇండస్ట్రీలో డమ్మీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ మధ్యకాలంలో హీరోయిన్ సమంతకు ఆఫర్లు రావడం లేదు . సోషల్ మీడియాలో ఆఫర్లు వచ్చినట్టు ప్రచారం జరుగుతున్నా కానీ కొన్ని కొన్ని ఆఫర్స్ ఫేక్ అంటూ తెలుస్తుంది . మరికొన్ని ఆఫర్స్ వచ్చినట్లే వచ్చి చేజారి పోతున్నాయి .
కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో సమంత స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన సినిమాలో హీరోయిన్గా ఆఫర్ అందుకుంది అంటూ ఓ రేంజ్ లో వార్తలు వినిపించాయి . సీన్ కట్ చేస్తే ఏకంగా మేకర్సే మా సినిమాలో హీరోయిన్ సమంత కాదు అంటూ తేల్చి చెప్పేశారు . ఈ న్యూస్ ఇప్పుడు హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు షారుక్ ఖాన్ లాంటి స్టార్ హీరో సరసన అవకాశమొచ్చింది అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేసారు .అయితే మేకర్స్ స్వయాన క్లారిటీ ఇవ్వడంతో అమ్మడి రేంజ్ ఢమాల్ అంటూ పడిపోయింది.
టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ మరో సినిమా చేయబోతున్నారని .. ఈ చిత్రంలో సమంతను హీరోయిన్గా తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే నిజమైతే షారూఖ్ తో, రాజ్‌కుమార్ హిరానీతో సమంతకి ఇదే తొలి సినిమా అయ్యేది. కానీ అది ప్రస్తుతానికి ఈ వార్త రూమర్ అనే క్లారిటీ వచ్చింది. ఈ వార్తలపై దర్శకుడు రాజ్‌కుమార్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఇవన్నీ కేవలం రూమర్స్ అని టీమ్‌మెంబర్ ఒకరు తెలిపారు.