యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి పార్ట్ సెప్టెంబర్ 27న భారీ లెవెల్‌లో రిలీజ్ చేయనున్నట్లు తాజాగా మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ క్రమంలో తాజాగా థాయిలాండ్ లో ఓ పాట షూటింగ్ పూర్తి చేసి టీమ్ అంతా హైదరాబాద్ చేరుకున్నారు. మరోపక్క సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.
దీంతోపాటే ఎన్టీఆర్ హిందీలో వార్ – 2, ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రశాంత్ నీల్ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగస్టులో మొదలుకానుందని.. ఎన్టీఆర్ పుట్టినరోజున అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. దేవర షూట్ పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ ఈ సినిమా పనులు స్టార్ట్ చేయనున్నాడు. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ల అవసరం ఉందని తెలుస్తుంది.
దీంతో సినిమా పై అంచనాలను పెంచేసేందుకు ఇద్దరు పాన్ ఇండియన్ బ్యూటీలను రంగంలోకి ప్రశాంత్ నీల్ దింపుతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా గతంలో ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందనాన్ని సెలెక్ట్ చేసారంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. రష్మిక మందన ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో నేషనల్ క్రష్‌గా దూసుకుపోతుంది. అలాగే మరో హీరోయిన్గా బాలీవుడ్ ముద్దుగా అలియా భట్ ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట తెగ చెక్కర్లు కొడుతుంది.