టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల ఇండస్ట్రీలోకి అతి చిన్న వయసులోనే అడుగుపెట్టి.. తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరో, హీరోయిన్ల అందరిలోనూ ఈ అమ్మడి వయసు చాలా చిన్నది. అయినప్పటికీ బోల్డ్ ఆలోచనలతో కథలను ఎంచుకుంటూ సినిమాల్లో దూసుకుపోతూంది. వరుస అవకాశాలను దక్కించుకుంటున్న ఈ చిన్నది ఇప్పటికే పలువురు టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
కొద్దిరోజుల క్రితం సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ నటించనున్న ఓ హిందీ సినిమాతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మొదటి సినిమా అది కాదంటూ మరో వార్త వినిపిస్తుంది. వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీల ఫిక్స్ అయిందట. ఈ సినిమాతో బాలీవుడ్ తెరకు అమ్మడు పరిచయం కాబోతుందని తెలుస్తుంది. ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.
శ్రీ లీల ఓ హీరోయిన్గా, మృణాల్ మరో హీరోయిన్గా ఈ సినిమాలో కనిపించనున్నారట. కామెడీ బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే లవ్ స్టోరీగా ఈ సినిమాని డైరెక్టర్ డేవిడ్ ధావన్ రూపొందించనున్నట్లు టాక్. జూలై నెల చివరి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అక్టోబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి శ్రీలకు హిందీలో ఇది మొదటి సినిమా అవుతుందా.. లేదా.. అనే క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.