సూపర్‌ స్టార్‌ బర్త్‌ డే కి స్పెషల్‌ ట్రీట్‌ రాకపోవడానికి కారణం అదేనా..? మొత్తం చెడ దొబ్బారుగా..!

నిజంగా నిన్న మహేష్ బాబు తన అభిమానులను డీప్ గా హర్ట్ చేశారు. మనకు తెలిసిందే మే 31 కృష్ణగారి హ్యాపీ బర్త డే. చాలామంది ఆయన పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన సినిమా విషయాలను ఆయన చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటూ ఉంటారు. అయితే మహేష్ బాబు మొదటి నుంచి తన తల్లిదండ్రులకు సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ న తన సినిమా విషయాలను అనౌన్స్ చేస్తూ వస్తూ ఉంటారు . అయితే ఈసారి కృష్ణ గారి బర్త డే సందర్భంగా ఒక్కటంటే ఒక్క అనౌన్స్మెంట్ కూడా రాలేదు .

దీంతో ఘట్టమనేని ఫ్యాన్స్ బాగా డీప్ గా హర్ట్ అయ్యారు . ఖచ్చితంగా రాజమౌళి మహేష్ బాబు సినిమాకి సంబంధించి ఏదో ఒక అప్డేట్ వస్తుందని ..అట్లీస్ట్ పూజా కార్యక్రమాలైనా ప్రారంభిస్తారు అని అనుకున్నారు . అంతకుముందు అదేవిధంగా ప్రచారం కూడా జరిగింది. అయితే లాస్ట్ లో అంత సర్వనాశనం అయిపోయింది . దానికి కారణం రాజమౌళినే.. రాజమౌళి ఏ విషయంలో అయినా సరే చాలా కఠినంగా ఉంటారు. అది అందరికీ తెలిసిందే .

రాజమౌళి – మహేష్ బాబుతో తెరకెక్కించే సినిమా విషయంలో లుక్స్ పరంగా సాటిస్ఫై అవ్వట్లేదట ..రాజమౌళి కోరుకున్న లుక్స్ వేరు మహేష్ బాబు రిజల్ట్ వేరేగా వచ్చిందట . దీంతో లుక్ టెస్ట్ కూడా చేయించారట. మొత్తంగా తొమ్మిది లుక్ లు మార్చగా తొమ్మిది లుక్స్ కూడా రాజమౌళికి నచ్చలేదట . దీంతో సరికొత్త లుక్స్ ను ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట . ఆ కారణంగానే రాజమౌళి కృష్ణ గారి బర్త డే సందర్భంగా ఎటువంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు అన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఘట్టమనేని ఫ్యాన్స్ తెగ బాధ పడిపోతున్నారు..!!