సినీ ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ అయ్యే ఏ సినిమా హిట్ అవుతుందో.. లేదో.. అనేది ముందే ఎవరూ చెప్పలేరు. స్టోరీ బాగున్న, లేకున్నా కొన్ని సినిమాలు ఒక్కోసారి బాక్ బస్టర్ గా నిలుస్తూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రం ఎంత మంచి కంటెంట్ ఉన్న అవి ఫ్లాప్స్ అవుతాయి. అలాంటి సినిమాలు చూసినప్పుడు ఇంత మంచి కంటెంట్ ఉన్న సినిమా ఎలా ప్లాప్ అయిందా అని అంతా భావిస్తూ ఉంటారు. అలా ఇటీవల కాలంలో మంచి కంటెంట్ వచ్చి ఫ్లీప్ అయిన సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.
అంటే సుందరానికి :
నాని హీరోగా నటించిన కామెడీ, ఫ్యామిలీ డ్రామా అంటే సుందరానికి. వివేకాత్రేయ దర్శకత్వంలో నజ్రియా హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమా కంటెంట్ ఎంతో అద్భుతంగా ఉన్న సినిమా వెండితెరపై సక్సెస్ సాధించలేకపోయింది. అయితే ఓటీటీలో మాత్రం ఇది సూపర్ హిట్ గా నిలిచింది. దీనిబట్టి సినిమా కంటెంట్ అద్భుతంగా ఉందని చెప్పొచ్చు.
విరాట పర్వం :
సాయి పల్లవి, రానా ప్రధాన పాత్రలో నటించిన విరాటపర్వం కథ కూడా అద్భుతంగా ఉంటుంది. నెక్సలిజం, విప్లవం, లవ్ స్టోరీని మిక్స్ చేసి తెరకెక్కించిన ఈ సినిమా బుల్లితెరపై ప్రేక్షకులను ఆకట్టుకున్నా.. వెండితెరపై ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. వేణు వడుగుల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
ఖలేజా :
మహేష్ బాబు, అనుష్క ప్రధాన పాత్రలో నటించిన మూవీ ఖలేజా. ఈ సినిమా థియేటర్స్ లో మంచి సక్సెస్ అందుకోకపోయినా.. ఇప్పటికీ టీవీలో వస్తుందంటే ఎంతమంది ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు.
వేదం :
మంచు మనోజ్, అల్లు అర్జున్, అనుష్క ప్రధాన పాత్రలో నటించిన మూవీ వేదం. సమాజాన్ని ఆలోచింపజేసేలా ఈ కథను తెరకెక్కించారు. ఇందులో చూపించిన ప్రతి పాత్ర ఒక్కో కథతో మనసును హత్తుకుంటాయి. ఇదొక మాస్టర్ పీస్ మూవీ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆ రోజుల్లో ప్రజలు థియేటర్లో దీనిని చూడడానికి ఇష్టపడలేదు. దీంతో ఈ సినిమా హిట్ అందుకోలేదు.
నగరానికి ఏమైంది :
యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ నగరానికి ఏమైంది సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో పాత్రలు ఎప్పటికీ గుర్తుండి పోయేలా డిజైన్ చేశారు. అయితే ఇది బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లు రాబట్టకపోయినా.. తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ను బాగా మెప్పించింది. ఇక జానీ, వన్ నేనొక్కడినే, జగడం, చక్రం, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్, జాను ఇలా సినిమాలు అన్ని కంటెంట్ బాగున్నప్పటికీ థియేటర్స్ లో హిట్ అందుకోలేకపోయాయి.