10 కోట్లు కాదు 100 కోట్లు ఇచ్చిన అందులో నేను నటించను తెగేసి చెప్పిన బన్నీ.. కారణం ఏంటంటే..?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ పుష్ప 2. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతున్న‌ సంగతి తెలిసిందే. మొదట బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న పుష్పాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బ‌డ్జ‌ట్‌లో రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సర్వే గంగా జరుగుతుంది. దీనికి సంబంధించిన క్లైమాక్స్ షూటింగ్ జరుగుతున్న క్రమంలో డైరెక్టర్ సుకుమార్.. పుష్ప మూవీ కంటే భారీగా పుష్ప 2 సినిమా తెరకెక్కిస్తున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Pushpa: The Rule sequel of Allu Arjun starrer emerges as the most awaited  film in 2023; check complete list

ఇక చివరిగా న‌టించిన‌ పుష్ప మూవీ తో నేషనల్ వైడ్‌ గా పాపులారిటీ దక్కించుకున్నాడు బ‌న్నీ. ఈ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు దక్కించుకున్న బన్నీ.. ఈ మూవీలో తన బాడీ లాంగ్వేజ్ తో హిందీ ఆడియన్స్‌కు మ‌రింత‌ దగ్గరయ్యాడు. పుష్ప 2 కోసం బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు వచ్చిన క్రేజ్‌ క్యాష్ చేసుకునే ప్రయత్నంలో ఎన్నో సంస్థలు పోటీ పడుతున్నాయి.

Tobacco - Ottawa Public Health

తాజాగా అల్లు అర్జున్ తో యాడ్ చేసేందుకు పలు ఆఫర్స్ వచ్చాయని.. అయితే కేవలం ఒక్క నిమిషం యాడ్లో నటించినందుకు రూ.10 కోట్ల ఇస్తామంటూ ఓ సంస్థ ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ రూ.10 కోట్లు కాదు రూ.100 కోట్లు ఇచ్చిన ఆ ఛాన్స్ నాకు వద్దు అంటూ కరాకండిగా చెప్పేసారట. అది టొబాకోకి సంబంధించిన యాడ్ అని తెలుస్తుంది. అలాంటి యాడ్స్ లో నటించడం ఇష్టం లేక అల్లు అర్జున్ నేను నటించన‌ని తెగేసి చెప్పినట్లు సమాచారం. ఈ న్యూస్ వైర‌ల్ అవ్వ‌డంతో బన్నీ ఫ్యాన్స్.. అదీ బన్నీ క్యారెక్టర్ అంటూ.. మా బన్నీ ఎంత డబ్బు ఇచ్చినా ఇలాంటి చెత్త యాడ్లలో నటించడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.