ఆ స్టార్ హీరో సినిమాల్లో శ్రీ లీల కాదు.. ఆ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్.. ఇంతకీ మూవీ ఏంటంటే..?!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కు టాలీవుడ్‌ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం త‌మిళ్‌లో వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న అజిత్.. త్రిష హీరోయిన్ గా విడముయ‌ర్చి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తుది దశకు చేరడంతో తన నెక్స్ట్ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి సెట్స్ పైకి తీసుకువచ్చాడు అజిత్.

Sreeleela with Ajith - Great Telangaana | English

గుడ్ బాడ్ అగ్లీ టైటిల్ తో.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెర‌కెక్కుతుంది. ఇటీవ‌ల ఈ మూవీ ఫ‌స్ట్ స్కెడ్యూల్ హైద‌ర‌బాద్‌లో గ్రాండ్ లెవెల్‌లో జ‌రిగింది. అలాగే ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను భారీ లెవెల్లో ఆకట్టుకుంది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని మాత్రం గోప్యంగానే ఉంచారు మేక‌ర్స్.

Will Keerthi Suresh Sign Another Women-Centric Film?

ఇటీవల ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తుందంటూ వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఆ ప్లేస్లో టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ నటించబోతుందని స‌మాచారం. కాగా సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉందా.. లేదా శ్రీ లీలా ప్లేస్ లోనే కీర్తి సురేష్ ని తీసుకుంటున్నారా అనే విషయంపై క్లారిటీ రాలేదు. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే కీర్తి సురేష్ ఖాతాలో మరో బడా ప్రాజెక్ట్ చేరినట్లే.