వాట్.. ఉదయ్ కిరణ్ నటించిన ఆ బ్లాక్ బస్టర్ మూవీని బన్నీ మిస్ చేసుకున్నాడా.. అదేంటంటే..?!

దివంగత నటుడు ఉద‌య్ కిరణ్ కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. లక్షలాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్.. మొదటి సినిమా చిత్రం తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో డైరెక్టర్ తేజకు మారో అవకాశం ఇచ్చాడు ఉదయ్ కిరణ్. తన నెక్స్ట్ మూవీ నువ్వు నేను సినిమాను కూడా తేజ దర్శకత్వంలోనే నటించాడు. అయితే ఈ సినిమా కూడా సంచలన సక్సెస్ సాధించడంతో ఇక్క‌సారిగా స్టార్ హీరోగా మారాడు. ఒకప్పుడు లవర్ బాయ్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ వరుసగా తేజ దర్శకత్వంలో నటించిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్లు అందుకోవడంతో.. ఉదయ్ కిరణ్ కి వరుస‌ సినిమా ఆఫర్లు క్యూ క‌ట్టాయి.

Nuvvu Nenu Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News & Videos  | eTimes

అంతేకాదు నువ్వు నేను సినిమాతో ఉదయ్ కిరణ్ కు ఉత్తమ నటుడిగా అవార్డు కూడా దక్కింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో ఆయన నటించాడు. అయితే మనసంతా నువ్వే సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకని హ్యాట్రిక్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఉదయ్ కిరణ్.. తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. దీంతో కెరీర్ ప‌రంగా ఫేయిల్‌యూర్‌ల‌తో మానసిక ఒత్తిడికి గురైన ఉదయ్ ఆత్మహత్య చేసుకుని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు. అయితే ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను సినిమా మొదట్లో తేజ బన్నీతో తెర‌కెక్కించాలని అనుకున్నాడట.

Allu Arjun shares COVID-19 health update, says he is recovering

తాను రాసుకున్న కథ‌కు బన్నీ క్యారెక్టర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందని ఆయన భావించి.. ఈ విషయాన్ని అల్లు అరవింద్‌కు చెప్పాడట. అయితే బన్నీ అప్పుడే మల్టీ మీడియా కోర్స్ నేర్చుకుంటున్నాడని.. హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి కాస్త టైం పడుతుందని అల్లు అరవింద్.. తేజ తో చెప్పడంతో.. మొదటి సినిమా హీరో ఉదయ్ కిరణ్ తోనే మరో సినిమాను చేశానని వివరించాడు తేజ. ఆ తర్వాత అల్లు అర్జున్.. రాఘవేందర్రావు డైరెక్షన్‌లో గంగోత్రి సినిమా వచ్చి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఉదయకిరణ్ నటించిన నువ్వా నేనా సినిమా బన్నీ మిస్ చేసుకున్నాడని తెలియడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.