ఓరి దేవుడోయ్.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు పై ఆ రేంజ్ లో బెట్టింగ్ జరుగుతుందా..? గెలిస్తే ఎంత..? ఓడితే ఎంత..?

ప్రెసెంట్ ఏపీ రాజకీయాలలో ఎలాంటి టెన్షన్ వాతావరణం నెలకొందో అందరికీ తెలిసిందే .. కేవలం కొద్ది గంటలు.. కొద్ది గంటలు మాత్రమే.. ఏపీ రాజకీయ చరిత్ర తిరగరాయబోతున్నారు ఏపీ జనాలు అన్న విషయం క్లారిటీకి వచ్చేస్తుంది . మనకు తెలిసిందే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరిగింది . రాజకీయ నేతల మధ్య హోరాహోరీగా మాటలు యుద్ధం కూడా జరిగింది . కాగా ఈసారి ఏపీలో అధికారం చేపట్టబోయేది కూటమినా ..? లేకపోతే వైసిపి పార్టీనా..? అనేది సంచలనంగా మారింది .

పలు సర్వేలు ఏపీలో అధికారం చేపట్టబోయేది కూటమి అంటూ క్లారిటీ ఇస్తుంటే ..మరి కొంతమంది మాత్రం లాస్ట్ మినిట్ లో ఏమైనా జరగొచ్చు .. వైసీపీ అధికారం చేపడితే ఆ కిక్కే వేరు అంటూ వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు. కాగా ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఏపీ రాజకీయాలు మొత్తం ఒక ఎత్తు కేవలం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు మాత్రమే మరొక ఎత్తు అన్న రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు జనాలు . పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అంటూ పలు సర్వేలు చెప్పేశాయి.

ఒకటి కాదు రెండు కాదు దాదాపు లక్షల ఓట్ల తేడాతో ఆయన గెలుపు తథ్యం అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే ఈ క్రమంలోనే బెట్టింగ్ రాయళ్ల హవా కొనసాగుతుంది.. పవన్ కళ్యాణ్ గెలిస్తే లక్ష రూపాయల కి మూడు లక్షలు అని పవన్ కళ్యాణ్ ఓడిపోతే లక్ష రూపాయలకు 10 లక్షలు ఇచ్చే విధంగా బెట్టింగ్స్ పెట్టుకుంటున్నారట . ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట బాగా వైరల్ గా మారింది . అయితే చాలామంది పవన్ కళ్యాణ్ గెలుస్తారు అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు . అందుకే ఓడిపోతే అన్న క్వశ్చన్ పై బెట్టింగ్ హై రేంజ్ లో ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ఈ విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!