ఈ మధ్యకాలంలో పలుగురు రిపోర్టర్స్ హీరోలను కానీ హీరోయిన్ లో కానీ ఓపెన్ గా ప్రశ్నించడం ప్రారంభించారు . మరి ముఖ్యంగా కొంతమంది హీరో హీరోయిన్స్ ఎప్పుడెప్పుడు దొరుకుతారా..? అని కాచుకొని కూర్చునే ఉండే బ్యాచ్ కూడా ఉంది . తాజాగా అలాంటి వాళ్లకు దొరికిపోయింది కృతి శెట్టి . మనకు తెలిసిందే.. ఉప్పెన సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది ఈ అందాల ముద్దుగుమ్మ .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో దూసుకుపోయింది . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా ఆమె కెరియర్ డౌన్ ఫాల్ అయిపోయింది.
తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది .. కోలీవుడ్ ఇండస్ట్రీలో మలయాళం ఇండస్ట్రీలో అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు వెళుతుంది. కాగా ప్రజెంట్ కృతి శెట్టి.. తెలుగులో నటించిన సినిమా మనమే . జూన్ 7వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే ట్రైలర్ లాంఛిం ఈవెంట్లో కృతశెట్టి ప్రెస్మీట్లో పాల్గొనింది . దీనితో రిపోర్టర్స్ ఆమెను పలు విధాలు ప్రశ్నలు ప్రశ్నించారు . ఇదే క్రమంలో తెలుగు ఇండస్ట్రీలో ఎందుకు సినిమాలు చేయడం లేదు అన్న ప్రశ్న ఎదురయింది .
అయితే చాలా బోల్డ్ గా స్టన్నింగ్ ఆన్సర్ ఇచ్చింది కృతి శెట్టి . “గ్యాప్ తీసుకోలేదు వచ్చింది ” అంటూ అల వైకుంఠపురం లోని ఫేమస్ డైలాగ్ ను వాడింది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉండే జనాలు కృతి శెట్టి డైలాగ్ కు ఓ అంటూ అరుపులు అరిచేశారు. అయితే కృతిశెట్టి కోలీవుడ్ మలయాళం లో ఆఫర్స్ రావడంతో తెలుగు ఇండస్ట్రీ లో గ్యాప్ వచ్చింది అన్న విషయాన్ని క్లారిటీ ఇచ్చింది . ప్రజెంట్ కృతి శెట్టి మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా మనమే ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది . ఈ సినిమాలో హీరోగా శర్వానంద్ నటించాడు. చాలా ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కిన్నట్లు ట్రైలర్ ఆధారంగా తెలుస్తుంది . కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు శర్వానంద్ అభిమానులు..!!