“కన్నీళ్లు తెప్పిస్తున్న విగ్నేశ్ శివన్ ఎమోషనల్ పోస్ట్”.. అసలు ఏమైందంటే..?

మన లైఫ్ ఎప్పుడు..? ఎలా ..? మారిపోతుందో..? ఎవ్వరం చెప్పలేం . చాలామందికి ఇలా జరుగుంటుంది . ప్రెసెంట్ అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నాడు కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్. కోలీవుడ్ ఇండస్ట్రీలో విగ్నేష్ శివన్ ఎలాంటి పాపులారిటీ సంపాదించుకున్నాడో మనకు తెలిసిందే. తెలుగులో పెద్దగా గుర్తింపు లేదు . నయనతార హస్బెండ్ గా మాత్రమే ఆయన పేరు తెలుగు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న విగ్నేష్ శివన్ – నయనతార ఫ్యామిలీ లైఫ్ ను చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు .

రీసెంట్గా విగ్నేష్ శివన్ నయనతార తన ఇద్దరు పిల్లలతో కలిసి డిస్నీ ల్యాండ్ కి వెకేషన్ కి వెళ్లారు . అక్కడ సరదాగా గడిపిన ఫొటోస్ ను షేర్ చేసుకున్నారు . ఇదే విషయం సోషల్ మీడియా వేదికగా చెబుతూ ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టాడు విగ్నేష్ శివన్. ” 12 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చాను .. అప్పుడు నా చేతిలో వెయ్యి రూపాయలు మాత్రమే ఉన్నాయి.. చెప్పులు వేసుకొని జోబులో వెయ్యి రూపాయలు పట్టుకొని పోడా పొడి అనే సినిమా షూటింగ్ పర్మిషన్ తీసుకోవడానికి వచ్చా.. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది ..ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ నా భార్య పిల్లలతో కుటుంబ సమేతంగా రావడం ఎంజాయ్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది ఎమోషనల్ గా కూడా ఉంది సంతృప్తికరంగా అనిపిస్తుంది “అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశాడు.

దీంతో ఫ్యామిలీ లైఫ్ అంటే అదే బాసు అంటూ కొందరు ఆయన మెసేజ్ ని ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. అలాగే డిస్నీ ల్యాండ్ ముందు దిగిన ఫ్యామిలీ ఫొటోస్ కూడా షేర్ చేశాడు విగ్నేష్ శివన్. ఆ పిక్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి అంటూ అభిమానులు ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. నయనతార వల్లే నీకు ఇప్పుడు ఇలాంటి పొజిషన్ వచ్చింది అంటూ నయనతార ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతూ ఉండడం గమనార్హం..!!

 

 

View this post on Instagram

 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)