ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే నందమూరి బాలకృష్ణ – అంజలి ఇష్యూ ఈ మధ్యకాలంలో ఎంత వైరల్ గా మారిందో. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య హీరోయిన్ అంజలి తో ప్రవర్తించిన తీరు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. స్టేజిపై ఆమెను నెట్టి వేస్తున్నట్లు కనిపించడం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవ్వడం .. ప్రముఖులు సైతం బాలయ్య వీడియో పై మండిపడడం మనం చూస్తున్నాం.
అయితే తాజాగా అంజలి ఈ వీడియో పై క్లారిటీ ఇచ్చింది. కానీ కొందరు మాత్రం బాలయ్యను పరోక్షంగా టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే బ్రహ్మాజీ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు . అది ఇప్పుడు బాలయ్యను మ్యాచ్ చేస్తూ జనాలు ట్రోల్ చేస్తున్నాడు . “వాడు దొంగతనం చేశాడు అని చెప్తే ..అది తప్పు అనడం మానేసి .. మావాడు దొంగ కాదు అని అంటారు ఏంటి..?? తప్పు మీనింగ్ మారిపోయింది ..తప్పు ఎవరు చేసినా తప్పే కదా..? వాడు మీ వాడైనా ..వాడు పరాయివాడైన ..?”అనే విధంగా రాసుకొచ్చాడు.
ప్రస్తుతం బ్రహ్మాజీ పెట్టిన పోస్ట్ బాగా వైరల్ గా మారింది . కావాలని బాలయ్యకు కౌంటర్ ఇచ్చాడు బ్రహ్మాజీ..అని కొందరు అంటున్నారు. బాలయ్య ఫ్యాన్స్ బ్రహ్మాజీపై మండిపడుతున్నారు . అయితే బ్రహ్మాజీపై కోప్పడాల్సిన అవసరం లేదని బాలయ్య చేసింది తప్పు అని మరి కొందరు బ్రహ్మాజీ కి సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయంపై బ్రహ్మాజీ క్లారిటీ ఇస్తే బాగుంటుంది అంటూ కూడా ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!