కెరీర్ స్ట‌ర్టింగ్‌లోనే వ‌రుస హ్య‌ట్రిక్‌ల‌ను అందుకుని రికార్డ్ సృష్టించిన టాలీవుడ్ స్టార్స్ లిస్ట్ ఇదే..

టాలీవుడ్ కెరీర్ స్టార్టింగ్ లో హ్యాట్రిక్ విజయాలను అందుకొని రికార్డ్ సృష్టించిన హీరోలు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. అందులో అల్లు అర్జున్, ఉదయ్ కిరణ్ పేర్లు బాగా వినిపిస్తాయి. అల్లు అర్జున్ హీరోగా సినీ కెరీర్ గంగోత్రి సినిమాతో ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.. హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మ్యూజికల్ గా సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్లో ఆర్య లో నటించి విజ‌యం పొంతం చేసుకున్నాడు.

Happy Birthday To Young & Talented Hero Raj Tarun | cinejosh.com

వి.వి. వినాయక్ డైరెక్షన్‌లో బ‌చ్చిన‌ బన్నీ సినిమాలు కూడా వరుసగా సక్సెస్ అందుకోవడంతో బన్నీ ఖాతాలో హ్యాట్రిక్ హిట్‌లు పడ్డాయి. అలాగే దివంగత హీరో ఉదయ్ కిరణ్ గ్రాండ్ లెవెల్ లో కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కెరీర్ విషాదంతో ముగిసింది. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న ఉదయ్ కిరణ్.. తొలి మూడు సినిమాలతో హ్యాట్రిక్ కొట్టడంతో పాటు.. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోయాడు.

naveen polishetty Archives | Telugu360.com

కానీ తర్వాత ఉదయ్ కిరణ్ కెరీర్ పరంగా ఒకసారిగా అవ‌కాశాలు తగ్గడంతో మాన‌సికంగా కృంగిపోయిన ఆయన సూసైడ్ చేసుకుని ఫాన్స్ కు షాక్‌ ఇచ్చాడు. హీరో రాజ్ తరుణ్ కూడా ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ ఇలా మొద‌టి మూడు సినిమీల‌తో హ్య‌ట్రిక్‌ హిట్లను అందుకున్నాడు. ఇక టాలీవుడ్ ఇక ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోలుగా దూసుకుపోతున్న అడ‌వి శేష్‌, నాని, నవీన్ పోలిశెట్టి లాంటి హీరోలు కూడా వరుసగా మొదట మూడు సినిమాలు తో హ్యాట్రిక్లను అందుకున్నారు.