సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరు కూడా వరుసలతో పిలుచుకోరు ..వరుసలను కేర్ చేయరు .. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ హీరో పక్కన ఎలా నటించాల్సి వస్తుందో ఎవరికీ తెలియదు.. గతంలో ఎంతో మంది స్టార్స్ ఒకే హీరోతో ఒకసారి హీరో యిన్ గా మరొకసారి సిస్టర్ గా నటించిన సందర్భాలు ఉన్నాయి . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ కి సంబంధించిన ఒక విషయం బాగా బాగా వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో ఎన్నెన్నో కాంబోలు వస్తూ ఉంటాయి. అయితే కొన్ని కాంబోలో సెట్ అయినట్లే అయి కొన్ని కారణాల చేత ఆగిపోతాయి.
అలా ఆగిపోయిన కాంబో నే రామ్ చరణ్ – అనుష్క . వీళ్ళ కాంబోలో మగధీర సినిమా రావాల్సింది .. కానీ ఆగిపోయింది. దానికి కారణం అనుష్క శెట్టినే.. రామ్ చరణ్ పక్కన నేను సిస్టర్ లా ఉంటాను అంటూ ఆమె ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట. స్వయాన ఈ విషయాన్ని ఆమె ఒప్పుకోవడం కూడా గమనార్హం. కాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా అనుష్కకు ఎన్టీఆర్ రామ్ చరణ్ ల గురించి ప్రశ్న ఎదురవుతుంది .హోస్ట్ ప్రశ్నిస్తూ ..”మీకు అట్ ఏ టైం రామ్ చరణ్ – ఎన్టీఆర్ సినిమాలలో నటించే అవకాశం వస్తే ఏ హీరో సినిమాలో నటిస్తారు..?” అంటూ ప్రశ్నిస్తుంది .
సెకండ్ కూడా ఆలోచించుకోకుండా అనుష్క శెట్టి ..జూనియర్ ఎన్టీఆర్ పేరు చెబుతుంది . ఆయనతో ఫుల్ యాక్షన్ జోనర్ మూవీ లేదా రొమాంటిక్ సినిమాలో నటించాలని ఉంది అంటూ తన మనసులోని కోరికను బయటపెడుతుంది. అయితే ఇదే మూమెంట్లో రాంచరణ్ తో సినిమాలో నటించే అవకాశం వచ్చినా కూడా కొన్ని కారణాల చేత రిజెక్ట్ చేసాను అని కూడా చెప్పుకొచ్చింది. దీంతో సోషల్ మీడియాలో అనుష్క శెట్టి పేరు వైరల్ గా మారింది.. కొంతమంది నీకు రామ్ చరణ్ తమ్ముడు అవుతాడా ..?అంటూ అనుష్కను ట్రోల్ కూడా చేస్తున్నారు..!!