ఈ మధ్యకాలంలో రెబల్ స్టార్ ప్రభాస్ కి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనం బాగా గమనిస్తూనే ఉన్నాము. మరీ ముఖ్యంగా ప్రభాస్ పెళ్లికి సంబంధించిన వార్తలు బాగా బాగా వైరల్ అవుతున్నాయి. అయితే రీసెంట్గా ఆయన సోషల్ మీడియాలో ” నా లైఫ్ లోకి స్పెషల్ పర్సన్ రాబోతుంది” అంటూ ఒక పోస్ట్ పెట్టి అభిమానులకు ఆశలు పెంచేసాడు. సీన్ కట్ చేస్తే 24 గంటలు కాకముందే అది కల్కి సినిమా ప్రమోషన్స్ కోసం అంటూ తేలిపోయింది . దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ డీప్ గా హర్ట్ అయ్యారు .
ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. ప్రభాస్ – అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది . అయితే శ్యామలాదేవి దానిపై క్లారిటీ ఇచ్చారు . “ప్రభాస్ పెళ్లి చేసుకోవడం మాకు కావాలి ..ఎవర్ని చేసుకున్నా ఓకే .. ఆయన ఇష్టపడిన అమ్మాయి ఎవ్వరైనా సరే మేము పెళ్లి చేస్తాం ..కొందరు అనుకున్నట్లు అనుష్కతో పెళ్లి అంటే రెబల్ ఫ్యామిలీ ఒప్పుకోవడం లేదు అనే వార్తలు విన్నాం. అలాంటిది ఏదీ లేదు .. ప్రభాస్ సంతోషమే మా ఇంపార్టెంట్.. ఆయన మనసుకు నచ్చిన అమ్మాయి అది ఎవ్వరైనా పెళ్లి చేస్తాం” అంటూ క్లారిటీ ఇచ్చింది .
అయితే ప్రభాస్ మనసులో ఎవరూ లేరు అంటూ కూడా చెప్పుకొచ్చింది. దీంతో ఫాన్స్ షాక్ అయిపోతున్నారు. ఒకపక్క మనసులో ఎవరూ లేక.. మరొక పక్క పెళ్లి పై ఇంట్రెస్ట్ చూపించక .. ఏంటి ..? ఈ దోబుచులాట.. ప్రభాస్ ఏమో పెళ్లి చేసుకుంటానంటాడు. శ్యామలాదేవి ఏమో దసరా లోపు ప్రభాస్ పెళ్లి అవుతుంది అంటుంది .. మరొకపక్క ప్రభాస్ ఏమో తన పెళ్లిపై ఊసే ఎత్తడు .. ఏంటి ఈ కన్ఫ్యూషన్ అంటూ అసహనంగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మరికొద్ది రోజుల్లో కల్కి సినిమా రిలీజ్ అవుతుంది అన్న మూమెంట్లో ప్రభాస్ ఫాన్స్ ఫుల్ కన్ఫ్యూషన్ లో పడిపోయారు.