పవన్ కళ్యాణ్ విజయం ..మెగా ఫ్యామిలీకి అలా కలిసి రాబోతుందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలవడం మెగా ఫ్యామిలీకి ప్లస్గా మారిపోతుందా..? ప్రెసెంట్ ఈ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . సినిమా ఇండస్ట్రీ అంటేనే నాలుగు కుటుంబాల చేతుల్లో ఉంది అంటూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే హీరోలలో సగానికి పైగా మెగా హీరోలే ఉండడం మనం గమనించాల్సిన విషయం . అయితే మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని అందరూ ఇండస్ట్రీలోకి వచ్చి తమదైన స్టైల్ లో ఏలేస్తున్నారు. రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయ చరిత్రను తిరగరాసాడు.

గేమ్ చేంజర్ గా మారిపోయాడు . ఏపీలో కూటమి అధికారం చేపట్టే విధంగా ప్లాన్స్ అమలు చేశాడు ..అనుకున్న విధంగా సక్సెస్ అయ్యాడు . పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మెగా ఫ్యామిలీ లేడీస్ కూడా సపోర్ట్ చేశారు . ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ రాజకీయంగా ముందుకు వెళ్లడానికి పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ ఇంకా హై రేంజ్ లో ఎదుగుతారా అన్న విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి . పవన్ కళ్యాణ్ మినిస్టర్ అయితే కచ్చితంగా మెగా ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీకి కాస్తో కూస్తో మేలు జరుగుతుంది అని ..

ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీని వైసిపి ప్రభుత్వం చాలా దారుణంగా తొక్కేసింది అని.. ఇష్టమున్న హీరోకి సినిమా టికెట్ రేట్స్ పెంచడం ఇష్టం లేని హీరోకి సినిమా టికెట్స్ రేట్ తగ్గించడం చేసింది అని ..అయితే పవన్ కళ్యాణ్ ఆ విధంగా చేయడు అని .. పవన్ చంద్రబాబు కలిసి సమాంతర న్యాయంగా వ్యవహరిస్తారు అని చెప్పుకొస్తున్నారు . అయితే కొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ మినిస్టర్ అవుతూ ఉండడం మెగా హీరోస్కు ప్లస్సుగా మారబోతుంది అని సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఆ హీరోస్ ని పెట్టి సినిమాలను తెరకెక్కించే విధంగా డైరెక్టర్ లు ఇంట్రెస్ట్ చూపిస్తారు అని మాట్లాడుకుంటున్నారు..!!