ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో రష్మిక మందన్నా హవా ఎలా కొనసాగుతుందో కూడా మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ ఇండస్ట్రీని ఓ రేంజ్ లో అల్లాడించేస్తుంది . పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్న తారక్..పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే . త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతుంది . ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఆగస్టులో సెట్స్ పైకి రాబోతుంది అంటూ అఫీషియల్ గా ప్రకటించాడు ప్రశాంత్ నీల్.
అప్పట్నుంచి ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నాఫిక్స్ అయినట్లు వార్తలు వినిపించాయి . అయితే తాజాగా రష్మిక మందన్నా ఈ సినిమాలో నటించాలి అంటే కొన్ని కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తుంది. అదే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక మందన్నా డి గ్లామరస్ లుక్ లో కనిపించను అంటూ తెగేసి చెప్పిందట . ప్రశాంత్ నీల్ చాలా వరకు డీ గ్లామరస్ లుక్ లోనే కనిపించేలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు.
గత సినిమాలు చూస్తే అది బాగా అర్థమవుతుంది . అందుకే రష్మిక ముందుగానే నేను ఈ సినిమాలో డి గ్లామరస్ లుక్ లో కనిపించను అంటూ చెప్పేసిందట . అంతేకాదు రెమ్యూనరేషన్ కూడా హైగా ఛార్జ్ చేస్తుందట. తారక్ సినిమా కావడం ..ఫర్ ద ఫస్ట్ టైం ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉండడం.. తారక్ రేంజ్ గ్లోబల్ స్థాయిలో పెరిగిపోవడం ఆమె రెమ్యూనరేషన్ డిమాండ్ చేసేందుకు ప్రధాన కారణం అంటూ తెలుస్తుంది . దీంతో పలువురు ఫాన్స్ ఆమెపై మండిపడుతున్నారు. ఆయనతో నటించడమే పెద్ద గొప్ప అవకాశం.. మళ్ళీ నువ్వు కండిషన్స్ కూడా నా..? టూ మచ్ చేస్తున్నావే..? అంటూ మండిపడుతున్నారు..!!