ఇది నిజంగా ఫ్యాన్స్ కి నవ్వాలో ఏడవాలో తెలియనటువంటి పరిస్థితి . హమ్మయ్య ఇన్నాళ్లు కష్టపడిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫైనల్లీ అనుకున్నది సాధించాడు అని ఆనందపడాలో..? ఇన్నాళ్లు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పవన్ ఇకపై సినిమాలకు దూరం కాబోతున్నాడు అని బాధపడాలో …? తెలియని అయోమయ స్థితిలో ఉండిపోయారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మనకు తెలిసిందే.. రీసెంట్ గా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ కూటమి భారీ కంచు కోటను బద్దలు కొట్టింది .
భారీ మెజారిటీతో గెలిచి అధికారం చేపట్టబోతుంది . దీంతో పవన్ కళ్యాణ్ కు మినిస్టర్ పోస్ట్ ఖాయం అనేది క్లారిటీకొచ్చేసింది . అయితే పవన్ ఒక మినిస్టర్ అయిన తర్వాత సినిమాలో నటిస్తాడా..? నటించడా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది . గతంలో చాలామంది పాలిటిక్స్ లోకి వచ్చాక సినిమాల్లో కూడా నటించారు . అది వాళ్ళ వాళ్ళ సొంత ఒపీనియన్ . అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తన పూర్తి జీవితం ప్రజాసేవకే అంకితం చేయాలి అని భావిస్తున్నాడట .
తనను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు ఫుల్ న్యాయం చేసే విధంగా తన పూర్తి సమయాన్ని రాజకీయాలకి అంకితం చేయాలి అనుకుంటున్నాడట. ఇప్పటివరకు కమిట్ అయిన సినిమాలను ఓకే చేసి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నాడట. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు బాలకృష్ణ కూడా అదే విధంగా చేయబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది .. బాలకృష్ణ వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి . అయితే వీళ్ళు అనుకున్నది సాధించారు అని ఆనందపడాలో ..? ఇండస్ట్రీకి దూరం కాబోతున్నారు అని బాధపడాలో..? తెలియని సిచువేషన్ లో ఉన్నారు ఫ్యాన్స్….!!