హీరో శర్వానంద్, కృతి శెట్టి ఇటీవల జంటగా నటించిన మూవీ మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ హైదరాబాద్‌లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. డైరెక్టర్ మారుతి, శివ నిర్మాణ, సాయిరాజేష్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు. ఈ సినిమా మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు వివరించారు.
ఇక ఇదే వేడుకల్లో ప్రముఖ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ చార్మింగ్ స్టార్ అంటూ శర్వీనంద్‌కు బిరుదు ఇచ్చాడు. ఈ మేరకు రూపొందించిన ప్రత్యేక వీడియోలు ఈవెంట్లో ప్రదర్శించారు. వేడుకను ఉద్దేశించి మాట్లాడుతూ ఏపీకి ఎన్నికల్లో గ్రాండ్ సక్సెస్ సాధించిన చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ గార్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ వివరించాడు. కష్టపడ్డారు మంచి ఫలితం సాధించారు. ఇదంతా చాలా ఆనందంగా అనిపిస్తుంది.
రిజల్ట్ తో పండగ వాతావరణం నెలకొంది అంటూ వివరించాడు. జూన్ 7న మన సినిమా రూపంలో మరో పండుగ వస్తుందని.. దాని తర్వాత 27న కల్కి పండుగ రానుందని.. ఇకపై అన్ని మంచి రోజులే అంటూ చెప్పుకొచ్చాడు. ప్రేక్షకులకు ఎప్పుడు కొత్తదనం చూపించే సినిమాను తీయడానికి ఇష్టపడుతూ ఉంటా.. ఈ సినిమాల్లో సందేశాత్మకమైన అంశం ఏదీ లేదు.. ఎంటర్టైనింగ్ కోసమే రూపొందించాం. చివరి 40 నిమిషాలు సినిమా అందరిని మరో ప్రపంచానికి తీసుకెళ్తుంది అంటూ వివరించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.