సూపర్ స్టార్ మహేష్ కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న మహేష్.. చిన్నతనంలోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించాడు. కృష్ణ చిన్ననాటి పాత్రలతో పాటు, తమ్ముడు పాత్రలోను ఆయన మెప్పించాడు. దాదాపు 9 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మహేష్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అందులో కొడుకు దిద్దిన కాపురం ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసింది.
తర్వాత రాజ కుమారుడుతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్.. రాఘవేంద్రరావు డైరెక్షన్లో ఈ సినిమాను నటించాడు. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. తర్వాత యువరాజు, వంశీ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ క్రమంలో కృష్ణవంశీ దర్శకత్వంలో తరకెక్కిన మురారి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇందులో పాటలు ఎవర్గ్రీన్ సాంగ్స్ గా నిలిచిపోయాయి. టక్కరి దొంగ, బాబి సినిమాలతోను ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయితే మహేష్ కెరీర్ స్టార్టింగ్ సినిమాల్లో ఎవరు రెమ్యూనరేషన్ ఆయనకు ఇవ్వలేదట. ఇది నీ రెమ్యూనరేషన్ అని ఫిక్స్ చేసి ఎవరు ఇవ్వలేదని.. మహేష్ గతంలో వివరించాడు.
ఖర్చుల వరకు తప్పితే రెమ్యునరేషన్ అనేది తెలియదని.. కమర్షియల్ హిట్స్ పడడం మొదలైన తర్వాతే రెమ్యూనరేషన్ ఇంత అని ఫిక్స్ చేసి ఇచ్చారంటూ మహేష్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఇలా మహేష్ కి ఒక్కడు మూవీ వరకు పెద్ద రెమ్యూనరేషన్ అందలేదని తెలుస్తుంది. కాగా మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తన సినిమాలో నష్టపోతే పారితోషకం వెనక్కి ఇచ్చేసేవాడు. నిర్మాతగా ఉన్నప్పుడు కూడా అలానే ఆయన చేశారు. అలవాటు మీకు కూడా ఉందా అని మహేష్‌ను ఆడిగిన ప్రశ్నకు స్పందిస్తూ కెరీర్ మొదట్లో తను రెమ్యునరేషన్ తీసుకోలేదని.. ఎవరు ఆయనకు రెమ్యునరేషన్ ఇవ్వలేదంటూ వివరించాడు.