వెంకీ మామ మజాకా.. ఒక్క దెబ్బతో సోషల్ మీడియాని మడత పెట్టేసాడుగా..!

ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న వెంకటేష్ లాంటి హీరో మాత్రం ఒక్కడే ఉంటాడు .. ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోడు.. ఏ విషయం గురించి టు డీప్ గా థింక్ చేయడు.. మనం ఉన్నామా..? మన పని మనం చేసుకున్నామా..? మనం ఎంజాయ్ చేసామా..? మనకు తగిన సహాయం చేశామా..? ఇవే ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. వేరొకరితో నాకు అనవసరం.. నా పని నాది.. నా నిజాయితీ నాది ..వేరొకరు నా గురించి అనుకున్నా నాకు సంబంధం లేదు అనే టైప్ మన వెంకటేష్ .

కాగా రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన అపోజిషన్ లీడర్ వంగా గీతా పై 74 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు . ఈ విషయం కేవలం రాజకీయాలలోనే కాదు సినీ ఇండస్ట్రీలోను సంచలనంగా మారింది . పవన్ కళ్యాణ్ గెలుపు పై ఎంతో మంది స్టార్ హీరోస్ ..హీరోయిన్స్ .. డైరెక్టర్స్.. ప్రొడ్యూసర్స్ ట్వీట్స్ చేసి పవన్ కళ్యాణ్ కు సపోర్టుగా నిలిచారు . కాగా అందరి ట్వీట్స్ లోకి వెంకీ మామ ట్వీట్ అద్దిరిపోయే రేంజ్ లో ఉంది.

” మా పిఠాపురం ఎమ్మెల్యే గారు”.. అంటూ పవన్ కళ్యాణ్ ను రేంజ్ లో పొగుడుతూ చాలా నాటీగా ట్విట్ చేశారు . ఈ ట్వీట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకునింది. చాలామంది పవన్ కళ్యాణ్ కు చాలా చాలా రెస్పెక్ట్ ఫుల్ గా మెసేజ్ చేశారు.. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే రెస్పెక్టే కాదు ..మిగతా నాటినెస్ కూడా కోరుకుంటారు .. ఆ నాటినెస్ను పండించి వెంకటేష్ ఒక్క దెబ్బతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చాడు.. పవన్ కళ్యాణ్ గురించి ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!