బన్నీ తో సినిమా తీస్తే..ఆ డైరెక్టర్లను మెగా హీరోస్ దూరం పెడతారా..? ఇదేం కొత్త తలనొప్పి..!!

ఎస్ ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మొదటి నుంచి మెగా ఫ్యామిలీ ఇండస్ట్రీలో రాజ్యం ఏలేస్తుంది. ఆ ఫ్యామిలీ హీరోలు ఏది చెప్తే అలాగే ముందుకు వెళుతూ ఉంటారు కొందరు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు . ఇది అందరికీ తెలిసిన విషయమే . ఇండస్ట్రీలో ఎంతోమంది మెగా ఫ్యామిలీకి ఎదురవెళ్లినా.. హీరోల కెరియర్లను నాశనం చేసిన రికార్డ్ మెగా ఫ్యామిలీకి ఉంది అంటూ జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రత్యక్షకంగా కానీ పరోక్షకంగా కానీ ఉదయ్ కిరణ్ జీవితం నాశనం అవ్వడానికి కారణం మెగా ఫ్యామిలీ అంటూ ఎంతోమంది ఇప్పటికీ చెప్పుకొస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ కన్ను అల్లు అర్జున్ పై పడింది అంటూ అల్లు ఫ్యాన్స్ మండిపడుతున్నారు .

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పై ఎలాంటి ట్రోలింగ్ జరుగుతుందో మనకు తెలిసిందే. కేవలం జనసేనకు సపోర్ట్ చేయలేదు అన్న కారణంతోనే మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు అర్జున్ దూరం పెట్టేసింది . అల్లు కుటుంబాన్ని కూడా మెగా ఫ్యామిలీ నుంచి వెలివేసినంత పని అయింది. పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన గ్రాండ్ వెల్కమ్ సెలబ్రేషన్స్లో అల్లు ఫ్యామిలీకి సంబంధించి ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించలేదు. దీంతో ఈ వార్ మరింత ముదిరిపోయింది . అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.

మెగా హీరోలు ఎవరు కూడా బన్నీతో డైరెక్ట్ చేసిన దర్శకులతో నటించకూడదు అంటూ కొత్త కండిషన్ పెట్టుకుందట మెగా ఫ్యామిలీ . కమిట్ అయిన సినిమాలకు తప్పిస్తే కొత్తగా కమిట్ అవుతున్న సినిమాలకు మాత్రం బన్నీతో ఎవరైతే డైరెక్టర్లు సినిమాలను ఓకే చేసుకున్నారో.. ఆ డైరెక్టర్స్ కు మెగా హీరోస్ అవకాశాలు ఇవ్వకూడదు అంటూ డిసైడ్ అయిందట . ఈ వార్తలో ఎంత నిజం ఉంది అన్నది తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది. ఒకవేళ అదే నిజమైతే మాత్రం నిజంగా బన్నీ కెరీర్ చిక్కుల్లో ఇరుక్కున్నట్టే . ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ప్రాబ్లమ్స్ కి ఫుల్ స్టాప్ పెట్టుకుంటే అటు బన్నీకి ఇటు మెగా ఫ్యామిలీకి ఇద్దరికీ మంచిదే అంటున్నారు సినీ విశ్లేషకులు..!!