లాస్ట్ మినిట్ పుష్ప 2 కి భారీ బొక్క పెట్టిన ఫహద్ ఫసిల్..సినిమా కి బిగ్ ఫైన్..!?

ఏంటో .. పుష్ప2 సినిమాకు ఒకటి పోతే ఒకటి ఆటంకం కలుగుతూనే ఉంది.. ఏదోలే బాగా కష్టపడ్డాడు పని ఆగస్టు 15వ తేదీ ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అనే సంతోషపడే లోపే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఒక వార్త బన్నీ ఫాన్స్ కు కన్నీళ్లు తెప్పిస్తుంది . సోషల్ మీడియాలో గత 48 గంటల నుంచి ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. పుష్ప 2 సినిమా ఆగస్టు 15 విడుదల కావడం లేదట . డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట . అంతేకాదు మెగా ఫ్యామిలీతో ఉన్న గొడవలు ఇందుకు కారణమంటూ కూడా ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. మెగా ఫాన్స్ ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి మూమెంట్లో అన్ని కోట్లు బడ్జెట్ పెట్టి తెరకెక్కించిన సినిమా రిలీజ్ చేస్తే ఫ్లాప్ చేసినా చేస్తారు .. అది మేకర్స్ కి నష్టం కలుగుతుంది అందుకని .. సుకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారట .

పైగా కొన్ని సీన్స్ కూడా రీ షూట్ చేయబోతున్నారట . దీని కారణంగా కూడా సినిమా మరింత ఆలస్యం కాబోతుంది అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . అయితే ఇలాంటి మూమెంట్లోని సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న మలయాళీ నటుడు సినిమాకి భారీ కండిషన్ పెట్టారట . ఈ మధ్యకాలంలో పుష్ప సినిమా షూట్స్ షెడ్యూల్ ప్రకారం జరగడం లేదు . కొన్ని కొన్ని సార్లు షూటింగ్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి . అయితే అదే టైం కి వేరే సినిమా షూట్ ఒప్పుకొని కూడా క్యాన్సిల్ చేసుకుని హైదరాబాద్ వస్తున్న ఫహద్ ఫజిల్ కి చాలా విసుగు వచ్చేస్తుందట.

అందుకే ఇకనుంచి షెడ్యూల్ అయిన షూటింగ్ క్యాన్సిల్ అయితే ఆయన రెమ్యూనరేషన్ డబల్ ఛార్జ్ చేస్తూ ఫైన్ వేయాలి అంటూ డిసైడ్ అయ్యారట . డే కింద కాల్ షీట్స్ కౌంట్ చేసుకుంటూ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు ఈయన. ఒక్కొక్క కాల్ షీట్ కు 15 లక్షలకు పైగానే ఛార్జ్ చేస్తున్నారట . అయితే ఒకవేళ ఇవాళ షూటింగ్ ఉంది అని చెప్పి ఎర్లీ మార్నింగ్ క్యాన్సిల్ చేస్తే మాత్రం దానికి డబల్ రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తారట. 30 లక్షలు అకౌంట్లో పడాల్సిందే అట . ఇప్పుడు ఈ న్యూస్ నెట్టింత బాగా ట్రెండ్ అవుతుంది. ఫహద్ పసిల్ కూడా టైం చూసి కొడుతున్నాడు అంటూ బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు..!!