పిఠాపురం ఎమ్మెల్యే “మా”వయ్యకు సాయిధరమ్ తేజ్ అద్దిరిపోయే గిఫ్ట్.. భలే వెరైటీగా ఉందే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ఈ పేరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎంత హాట్ గా ట్రెండ్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ప్రతి ఒక్క చోట ఆయన పేరు చెప్పిస్తున్నారు జనాలు .. ఆయన పేరే మాట్లాడుకుంటున్నారు .. ఆయన గురించి చర్చించుకుంటున్నారు. రీసెంట్గా డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. కాగా సోషల్ మీడియాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ను ఓ రేంజ్ లో అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు .

జనాలు ముందుగానే ఆయన అంటే పడి చచ్చిపోతారు. ఇప్పుడు ఆయన ప్రజాసేవకు లైన్ క్లియర్ అయింది .. ఇక ఫాన్స్ ని ఆపడం పెద్ద కష్టమే అంటూ జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా అధికారం చేపట్టడంతో పలువురు ఆయనకు మంచి మంచి గిఫ్ట్ లు అందజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఆయన వదిన సురేఖ గారు పవన్ కళ్యాణ్ కోసం కాస్ట్లీ బ్రాండ్ మౌంట్ బ్లాక్ పెన్నును గిఫ్ట్ గా ఇచ్చారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి .

ఇప్పుడు మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా పవన్ కళ్యాణ్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. నన్ను స్టార్ వార్స్ లెగో కు పరిచయం చేసిన నా ప్రియమైన జేడీ మాస్టర్ అండ్ డిప్యూటీ సీఎంకు చివరకి నా చిన్ననాటి రోజులను తిరిగి పొందేందుకు అతనిలోని చైల్డ్ కు గిఫ్ట్ ఇచ్చే ఛాన్స్ లభించింది.అంటూ సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేసాడు.