ఓరేయ్ అబ్బాయిలు .. అండర్ వేర్ ను వాష్ చేయకుండానే తిప్పితిప్పి వాడుతున్నారా..? వద్దురా బాబోయ్.. మహాడేంజర్..!

మీరు నవ్వుకున్న.. తిట్టుకున్న.. మరి ఏ పని చేసినా ఇదే నిజం అంటున్నారు డాక్టర్లు. మరీ ముఖ్యంగా కొంతమంది బ్యాచిలర్స్ హాస్టల్లో ఉండే పిల్లలు కొన్ని కారణాల చేత .. లేకపోతే బద్ధకం చేత అండర్ వేర్ ని ఉతక్కుండానే తిప్పి తిప్పి మారుస్తూ వేసుకుంటూ ఉంటారు . ఇది చాలామందికి అలవాటు ఉంటుంది . అయితే అలా అండర్ వేర్ ని వాష్ చేయకుండా పదేపదే ఒక్కటే అండర్వేర్ను వేసుకోవడం వల్ల చాలా చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయట.

అవి పెద్ద ప్రమాదాలు కూడా దారితీస్తాయట . అందుకే అలాంటి సమస్యలు రాకుండా ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు డాక్టర్లు. నిజానికి ప్రతి ఎనిమిది గంటలకు.. ఒకసారి అండర్ వేర్ ని మార్చుకోవడమే ఉత్తమమైన లక్షణం . కానీ ఆఫీసులకు వెళ్లే వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్లు వేరే పని మీద బయటకు వెళ్లే వాళ్ళు అలా చేయలేరు. కనీసం రోజుకు ఒక్కసారైనా సరే అండర్ వేర్ ని నీటుగా వాష్ చేసుకోవాలి అంటున్నారు డాక్టర్లు .

అంతేకాదు రాత్రి సమయంలో అండర్ వేర్ వేసుకోకుండా ఉండడమే మంచిది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎవరైతే హాస్టల్ పిల్లలు ఒకటే అండర్వేర్ను తిప్పి తిప్పి మార్చి మార్చి ఒకటి అండర్ వేర్ మరొకరు వేసుకుంటారు . అలాంటి వాళ్లకు త్వరగా ప్రైవేట్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తాయట .. అవి పెద్ద సమస్యలు కూడా దారి తీయచ్చట . అందుకే మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది అంటున్నారు డాక్టర్లు.. ఇకనైనా సరే ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్లు ఆ తప్పు చేయకుండా సింపుల్ గా ఎవరి అండర్ వేర్ వాళ్ళు వేసుకొని ప్రతిరోజు వాష్ చేసుకొని ఆరబెట్టుకోవడం మంచి పని అంటూ చెప్పుకొస్తున్నారు డాక్టర్..!!