బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఊహించని కంటెస్టెంట్ గా సీనియర్ హీరో శివాజీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలకు దూరమై చాలా కాలం అయిన శివాజీ మళ్లీ బిగ్ బాస్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. ఈ షోలో శివాజీ రెండు,మూడు వారాలు ఉంటే ఎక్కువేనని మొదట అంత భావించారు. కానీ బిగ్‌బాస్ అభిమానుల అంచనాలను తలకిందులు చేస్తూ ఫైనల్ వరకు చేరుకున్నాడు శివన్న. థర్డ్ రన్నర్ ఆఫ్ గా బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన సీజన్ 7 టైటిల్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.
ప్రతి టాస్క్, గేమ్‌లో పల్లవి ప్రశాంత్ ను ప్రోత్సహిస్తూ వచ్చిన శివాజీ.. టైటిల్ గెలవలేకపోయినా.. ప్రశాంత్ అభిమానుల మనసుల్లో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో శివాజీ పాల్గొనబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సారి కంటెస్టెంట్గా కాదు.. ఈ టాక్ షో ప్రతి సీజన్ కు బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన మాజీ కంటెస్టెంట్ ఒకరు బిగ్‌బాస్ బజ్ హోస్ట్గా వ్యవహరిస్తూ ఉంటారు.
గత సీజన్లో గీత రాయాల్ బిగ్ బాస్ బజ్ హోస్ట్‌గా వ్యవహరించింది. బయటకు వచ్చిన కాంటెస్టెంట్‌ను టాక్ షోలో హోస్ట్ ఆసక్తికర ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. కంటిస్టెంట్ ఆట తీరు, అలాగే వారు బయటకు రావడానికి గల కారణాలు కూడా ఈ టాక్ షోలో విశ్లేషిస్తూ ఉంటారు. వారి నుంచి తమ అభిప్రాయాన్ని రాబడుతూ ఉంటారు. అంతేకాదు బిగ్ బాస్ హౌస్ లో ఇతర కంటెస్టెంట్లతో ఎలిమినేట్ అయిన కంటిస్టెంట్‌కు ఉన్న బాండింగ్ గురించి కూడా వీరు వివరిస్తారు. ఈ క్రమంలో ఈ సీజన్ కు బజ్ టాక్ షోకు హోస్ట్గా శివాజీ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది.