ఒకేసారి నాలుగు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన మెగాస్టార్‌.. ఇంట్ర‌స్టింగ్ సీక్రెట్ రివీల్ చేసిన చ‌ర‌ణ్..?!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఈ పేరుకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెగాస్టార్‌గా పాపులారిటి తగ్గించుకున్న చిరంజీవి గత రెండేళ్లుగా ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే ఆయన రీ ఎంట్రిలో ఊహించిన రేంజ్ లో సక్సెస్ అంద‌లేదు. అలాంటి నేపథ్యంలో ఒకేసారి నాలుగు ప్రాజెక్టులతో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడట చిరంజీవి. నేడు ఫాదర్స్ డే సందర్భంగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్‌ ఈ విషయాన్ని స్వయంగా వివరించాడు.

Viral: Ram Charan's shocking comments on 'Acharya' failure

ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి చిరంజీవి గురించి ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా ప్రస్తావించి చెప్పుకొచ్చాడు. ఆయన తండ్రి వయసు ఉన్న కొద్ది తగ్గుతుందని.. ప్రస్తుతం అతడు నాలుగు కొత్త సినిమాలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ వివరించాడు. ఇప్పటికి ఆయన ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు లేచి జిమ్ చేస్తారని.. నటులు అయినంత మాత్రాన ఆయన ఇవన్నీ చేయాల్సిన పనిలేదు.. ఫిట్గా ఉండాలని ఉద్దేశంతో తనకు తానుగా ఈ డైలీ రొటీన్ ను పాటిస్తూ ఉంటాడు. ఇప్పటికీ ఎంతో మంది డైరెక్టర్లను కలుస్తున్నారు. ఆయన బిజీఎస్ యాక్టర్.. ప్రస్తుతం నాలుగు సినిమాలుకు ఒకేసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేను ఒకటో, రెండో సినిమాలు మాత్రమే నటిస్తున్న అంతే అంటూ వివ‌రించాడు.

Chiranjeevi and Ram Charan plan to compensate investors for 'Acharya'  losses-Telangana Today

మా నాన్న వయసు ఎక్కువ కాదు.. తక్కువ అయిపోతుందనిపిస్తుంది.. అంటూ చరణ్ చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆ నాలుగు సినిమాలపై వివరాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇక మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభ‌ర మూవీ లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలుసు. చరణ్ గేమ్ చేంజర్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఆర్ఆర్ తర్వాత చరణ్ నుంచి ఒక్క సోలో సినిమా కూడా రాలేదు. ఈ క్రమంలో గేమ్ చేంజర్‌ కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు.