మ‌రోసారి తిర‌గ‌బ‌డిన స‌మంతా వ్యాధి.. ఆక్సిజ‌న్ మాస్క్‌తో వీడియో లీక్‌.. షాక్‌లో ఫ్యాన్స్‌..?!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత కొంతకాలంగా మాయోసైటీస్ కారణంగా సినిమాలకు దూరమైన ఈ అమ్మడు.. మళ్ళీ ఎంట్రా ఇస్తానని చెప్పినప్పటికీ తన సొంత బ్యానర్ ట్రలాలా ఫిలిమ్స్ పై ఒక సినిమా తప్ప మరో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలు.. తన హాట్‌ అందాలతో ఆకట్టుకుంటుంది. హద్దులు చెరిపి మరీ బోల్డ్ పిక్స్ తో యూత్ కు హిట్ ఎక్కిస్తుంది. అలాగే ఓ హెల్త్ క్యాస్ట్ స్టార్ట్ చేసి అందులో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ప్రేక్షకులకు వెల్లడిస్తుంది.

దీంతో అంతా ఆమెకు మయోసైటిస్ వ్యాధి తగ్గిందని భావించారు. అయితే తాజాగా శ్యామ్ త‌న ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోని షేర్ చేసింది. అందులో కొన్ని థెరఫీలు తీసుకుంటూ కనిపించిన ఈ అమ్మడు.. ఆక్సిజన్ మాస్క్‌ పెట్టుకుని మెషిన్ లో పడుకున్నా చిన్న క్లిప్ కూడా కనిపించింది. అలాగే నేను ఈ చికిత్సలకు ఆనందిస్తున్న.. ఇవి మనసుకు, శరీరానికి రెండిటికి అద్భుతంగా ప్రయోజనాలను అందిస్తున్నాయంటూ వివరించింది. ఇందులో మొదటిది కొలజాన్ బెడ్.. చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరిచి యంగ్‌గా కనిపించేందుకు తోడ్పడుతుంది.

హైపర్బేరిక్ థెరపీ.. ఆక్సిజన్ స్థాయిలను పెంచి వైద్యం వేగవంతంగా జరిగేందుకు సహకరిస్తుంది, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్రేవో థెరఫి.. మంటను, నొప్పిని తగ్గించి ఎనర్జీ లెవెల్స్ ను పెంచుతుంది. మరిన్ని వివరాలకు నా ఛానల్ ను ఒకసారి చూడండి అంటూ ఆమె పేర్కొంది. టేక్ 20, ఇక్కడ మేము మీ మనసు, శరీరాన్ని మెరుగుపరచడానికి ఎన్నో పద్ధతులను కనుగొనమంటూ వివరించింది. ప్రజెంట్ సమంత వీడియో నెట్టింటి వైరల్ అవ్వడంతో.. ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. మళ్లీ మయోసైటిస్ తిరగబడడం వల్ల ఇలాంటి థెరఫీలు తీసుకుంటుందా.. లేదా అందరికీ తెలియజేయడానికే ఈ థెరఫీల గురించి వివరించిందా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)