చిన్నపిల్లలు తరచూ మూత్రం వెళ్తున్నప్పుడు నొప్పి అంటూ బాధపడుతున్నారా..? ఈ సింపుల్ చిట్కా ఫాలో అవ్వండి..!

చిన్నపిల్లల ఇంట్లో ఉంటే కచ్చితంగా కొన్ని కొన్ని చిట్కాలు సలహాలు తెలుసుకొని ఉండాలి .. చిన్న పిల్లలకి ఎప్పుడు ఏం బాగో లేకుండా వస్తుందో..? ఎవ్వరం చెప్పలేం. బాగా ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడుకుంటూ తింటూ తిరుగుతూ సరదాగా గడుపుతూ ఉంటారు . కానీ సడన్గా రాత్రికి రాత్రి కడుపులో నొప్పి అంటారు . చెవిలో నొప్పి అంటారు. మరి కొంతమంది పిల్లలకు మూత్రం పోసేటప్పుడు ప్రైవేట్ పార్ట్ నొప్పిగా ఉంటుంది . రకరకాల ఫీలింగ్స్ చెబుతూ ఉంటారు . కొంతమంది పిల్లలు అయితే అసలు ఎక్కడ నొప్పి ..? ఏం నొప్పి..? అని చెప్పను కూడా చెప్పలేరు.

అలాంటి వాళ్ళు కూడా ఉంటారు . ఒక తల్లిదండ్రులుగా పిల్లలకు ఏం బాగోలేదు..? ఎటువంటి సమస్యలు రాబోతున్నాయి ..? అని తెలుసుకోవడం పేరెంట్స్ డ్యూటీనే.. అయితే ఎక్కువగా చిన్న పిల్లల్లో వచ్చే సమస్య మూత్రం పోసేటప్పుడు నొప్పిగా ఉండడం. దీనికి మెయిన్ రీజన్ వాళ్ళు ఎక్కువగా వాటర్ తాగకపోవడం . మనం చెప్తే తప్పిస్తే పిల్లలు వాటర్ తాగనే తాగరు.. పిల్లలకు తరచూ గంటకు ఒకసారి రెండు గంటలకు ఒకసారి గ్లాస్ తో వాటర్ ఇస్తూ ఉండాలి..

అప్పుడు బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్న ఆ టాక్సిక్స్ మొత్తం రిలీజ్ అయిపోతాయి . అంతేకాదు కొంతమంది పిల్లలు యూరిన్ వస్తున్న సరే ఆపుకొని మరి ఆడుకుంటూ ఉంటారు . చాలామంది చిన్నపిల్లల్లో ఇది గమనిస్తూ ఉంటాం. అది చాలా చాలా తప్పు పెద్ద ప్రమాదకరంగా మారిపోతుంది .. పిల్లలకు కనీసం రెండు గంటలకు ఒక్కసారైనా సరే యూరిన్ వెళ్లాలి .. ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా పెద్దలు ఆ విషయాన్ని గమనిస్తూ ఉండాలి. మరీ ముఖ్యంగా వేడి వస్తువులు తిన్నప్పుడు లేదా పిల్లలు మూత్రం పోసేటప్పుడు నొప్పి అంటున్నప్పుడు ..ఒక తడి బట్టను అది వాళ్ళ ప్రైవేట్ పార్ట్ పై వేస్తే ఆ వేడి అనేది లాగేస్తుంది . ఆ తర్వాత యూరిన్ కి వెళ్ళిపోతారు. నెమ్మదిగా నొప్పి తగ్గిపోతుంది ,..చిన్నపిల్లలకి ఎక్కువగా మందులు వాడకూడదు .. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో వాళ్ల సమస్యలను దూరం చేసేయాలి అంటున్నారు నిపుణులు..!!