చాలా చిన్న ఏజ్ లోనే .. ఆడపిల్లలు ఎందుకు పుష్పవతులు అవుతున్నారో తెలుసా..?

ఈ మధ్యకాలంలో చాలా చాలా ఎక్కువగా మనం ఇలాంటివి వింటున్నాం.. సాధారణంగా ఎవరైనా సరే ఆడపిల్ల ఒక ఏజ్ కి రాగానే పుష్పవతులు అవుతూ ఉంటారు . అయితే ఈ మధ్యకాలంలో మాత్రం చాలా చాలా చిన్న ఏజ్ లోనే పిల్లలు పుష్పవతులు అవుతున్నారు . మరీ ముఖ్యంగా 10 వయసు దాటిన పిల్లలు కూడా పుష్పవతులు అవుతూ ఉండడం గమనార్హం. అయితే దానికి కారణం తీసుకునే ఫుడ్ అంటున్నారు డాక్టర్లు .

మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్స్ తినడం .. అదేవిధంగా ఫ్రూట్ జ్యూసెస్ కన్నా కూడా సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం ..గ్యాస్ ఐటమ్స్ ను ఎక్కువగా తీసుకుంటూ ఉండడం చిన్నపిల్లల్లోని హార్మోన్స్ త్వరగా పెరిగిపోతున్నాయట . ఆ కారణంగానే అతి చిన్న వయసులోనే హార్మోన్స్ బాగా డెవలప్ అయిపోయి పిల్లలు థర్డ్ క్లాస్ టైం లోనే పెద్ద పిల్లలుగా అవుతున్నారట .

అంతేకాదు దీనిపై తల్లిదండ్రులు కచ్చితంగా డెసిషన్ స్ట్రాంగ్ గా తీసుకోవాలి అని పిల్లలు ఎంత అడిగినా సరే జంక్ ఫుడ్స్ ..ప్రాసెస్డ్ ఫుడ్స్ లాంటివి ఎంకరేజ్ చేయకూడదు అని .. మంచి ప్రోటీన్ ఫుడ్ ..ఫైబర్ ఫుడ్ పెడితే.. పిల్లలు స్ట్రాంగ్ గా ఉంటారు అని.. కచ్చితంగా ఎదిగే పిల్లలకు డ్రై ఫ్రూట్స్ అనేటివి కంపల్సరిగా ఇవ్వాలి అని చెప్పుకొస్తున్నారు. తల్లిదండ్రులు తీసుకునే కొన్ని కొన్ని స్ట్రాంగ్ డెసిషన్స్ పిల్లల భవిష్యత్తుకు పునాది బాగా పడుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు డాక్టర్లు.