రవితేజ పై అలాంటి కామెంట్.. ఇచ్చిపడేసిన డైరెక్టర్ హరీష్ శంకర్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాజిటివిటీ కన్నా నెగెటివిటీ నే ఎక్కువగా చూస్తున్నాము. మరీ ముఖ్యంగా సినిమాల విషయంలో క్రిటిక్స్ ఎలా వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడుతున్నారో.. మనం బాగా చూస్తున్నాం . ఈ మధ్యకాలంలో చాలా చాలా మంది స్టార్ సెలబ్రెటీస్ పై క్రిటిక్స్ రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజా గా పాపులారిటీ సంపాదించుకున్న రవితేజ మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ హరిష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్.

ఈ సినిమా పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు మాస్ మహారాజా ఫ్యాన్స్ . ఈ సినిమాతో మరో ఇడియట్ లాంటి సినిమా ఖచ్చితంగా తన ఖాతాలో వేసుకోబోతున్నాడు అంటూ ఫిక్స్ అయిపోయారు . సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మిస్టర్ బచ్చన్ షో రీల్ అంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు . ఈ వీడియో బాగా వైరల్ గా మారింది . అయితే ఈ వీడియో పై ఓ తమిళ్ క్రిటిక్ షాకింగ్ కామెంట్స్ చేశారు .

ఈ మధ్యకాలంలో రవితేజ తన సినిమాల కథల విషయంలో కన్నా హీరోయిన్స్ విషయంలోనే బాగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే విధంగా మాట్లాడారు. దీనికి వెంటనే అద్దిరిపోయే కౌంటర్ ఇచ్చేశాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఇంకా రిలీజ్ అవ్వని సినిమా గురించి ఇలా మాట్లాడతావా..? నువ్వు కామెడీలు బాగా చేస్తున్నట్లు ఉన్నావే ..నిన్ను కమెడియన్ గా పెట్టుంటే బాగుండేది. పర్లేదులే ఇలాంటి కామెడీ ఎక్కువగా సోషల్ మీడియాలోనే చెయ్ అంటూ అద్దిరిపోయే రేంజ్ లో కౌంటర్ వేశాడు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!