మీకు తెలుసా..తెలుగు ఇండస్ట్రీలో ఆ అలవాటు ఉన్న స్టార్ హీరోస్ వీళ్ళే..!

సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్ కి వాల్యూ వచ్చే హీరోస్ చాలా చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం . అయితే ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా చేసే హీరోస్ మాత్రం చాలా రేర్ గా ఉంటారు . మన ఇండస్ట్రీలో అలా ఫ్రెండ్షిప్ కోసం సినిమాలను వదులుకున్న హీరోస్ అదే విధంగా ఎన్నో ఎన్నో త్యాగాలు చేసిన హీరోస్ ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

జూనియర్ ఎన్టీఆర్ : ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం ఇచ్చేస్తాడు.. అందరిని నమ్మడు. నమ్మిన వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేస్తే మాత్రం అస్సలు వదలడు ..తారక్ కి బన్నీకి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .తారక్ వద్దకు వచ్చిన మంచి కథలు బన్నీకి సూట్ అవుతాయి అనిపిస్తే ఏకంగా డైరెక్టర్స్ కు ఆయన పేరుని సజెస్ట్ చేస్తూ ఉంటారు . బన్నీ కూడా అంతే ఇదే విధంగా తారక్ కు తన వద్దకు వచ్చిన సినిమాలను సజెస్ట్ చేస్తూ ఉంటాడు.

పవన్ కళ్యాణ్: పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకునే ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. ప్రజెంట్ పిఠాపురం ఎమ్మెల్యేగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు . త్రివిక్రమ్ శ్రీనివాస్ రావుకి పవన్ కళ్యాణ్ కి మధ్య ఫ్రెండ్షిప్ కి మించిన బాండింగే ఉంది . పవన్ కళ్యాణ్ కోసం త్రివిక్రమ్ ఏం చేశాడు..? త్రివిక్రమ్ కోసం పవన్ కళ్యాణ్ ఏం చేశాడు ..?అన్న విషయం అందరికీ తెలిసిందే . వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ బాండింగ్ చూసి కూడా చాలామంది కుళ్లుకుంటూ ఉంటారు.

మహేష్ బాబు : అందరితో ఫ్రెండ్షిప్ చేయడు.. చేసిన నలుగురు ముగ్గురితో మాత్రం బాగా ర్యాపో పెంచుకుంటాడు . బాగా నమ్ముతాడు మరీ ముఖ్యంగా మహేష్ బాబుకి వంశీ పైడిపల్లికి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . వీళ్ళిద్దరిది ఫ్రెండ్షిప్ అనకూడదు అంతకుమించిన రేంజ్ లోనే బాండింగ్ అని చెప్పాలి.. మహేష్ బాబు కోసం వంశీ పైడిపల్లి చాలా త్యాగాలు చేశాడు .అలాగే వంశీ పైడిపల్లి కెరియర్ సెటిల్ అవ్వడానికి మహేష్ బాబు ఎన్నోసార్లు ఆఫర్లు కూడా ఇప్పించాడు..!!


రామ్ చరణ్ : సినిమా ఇండస్ట్రీలో కన్నా బయట ఫ్రెండ్స్ చరణ్ కు ఎక్కువ . ఈ విషయం ఓ ఇంటర్వ్యూలో ఆయనే చెప్పుకొచ్చాడు . మరీ ముఖ్యంగా చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఆయన ఎక్కువగా రాపో మెయింటైన్ చేస్తూనే ఉంటారు . చరణ్కి ఫ్రెండ్స్ ఎక్కువే ..హీరోల కన్నా బయట సర్కిల్స్ లోనే ఎక్కువగా ఫ్రెండ్స్ ఉంటారు . అయితే పార్టీలు పబ్బులు అంటూ తిరగడు. ఎవరైనా సహాయం కోసం వస్తే మాత్రం వెంటనే చేసేస్తారు అలాంటి ఓ మంచి మనసున్న వ్యక్తి రామ్ చరణ్.