నయనతార, త్రిష మధ్య మొదలైన కోల్డ్ వార్.. కారణం ఏంటంటే..?!

నయనతార, త్రిష ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోయిన్‌లుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. త్రిష మధ్యలో సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పటికీ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస హిట్లు అందుకుంటూ భారీ పాపులారిటీ దక్కించుకుంటుంది. ఈ క్రమంలో నయనతార, త్రిష మధ్య కోల్డ్ వార్‌ జరుగుతుందని.. నయన్ కంటే త్రిష అడుగు ముందు ఉండడంతో నయనతారకు ఇబ్బంది ఎదురవుతున్నాయని తెలుస్తుంది. లేడి సూపర్ స్టార్ పెడుతున్న కండిషన్స్ త్రిష కు మరింత ప్లస్ గా మారాయని టాక్. అయితే అసలు న‌య‌న్, త్రిష కు మధ్య కోల్డ్ వార్ ఏంటి.. అసలు ఏం జ‌రిగిందో ఒకసారి చూద్దాం.

Nayanthara Trisha Pans updated... - Nayanthara Trisha Pans | Facebook

నాలుగు పదుల వయసు దాటిన తర్వాత త్రిష దశ తిరిగింది. కోవిడ్ ముందు వరకు ఈమెకు అవకాశాలు లేకపోవడంతో కెరీర్ ఎండ్ అయిందని అంత భావించారు. ఓ టైంలో పెళ్లికి కూడా సిద్ధమైన త‌ర్వాత‌ పెళ్లి ఆగిపోయింది. అయితే ప్రస్తుతం త్రిష రేంజ్ వేరే లెవెల్ కి వెళ్ళింది. పదికి పైగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న త్రిష.. ప్రస్తుతం చిరు విశ్వంభర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కొక్క సినిమాకు రూ.6 కోట్ల రెమ్యున‌రేషన్ అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. చిరు విశ్వంభరకు ఏకంగా రూ.10 కోట్ల రమ్యున‌రేషన్‌ తీసుకుంటుందట. ఇదే టైంలో నయనతారకు వచ్చే ఛాన్సులు కూడా త్రిష కే వెళ్తున్నాయని.. దీంతో వీరిద్దరి మధ్యన అంతర్గతంగా వార్‌ మొదలైందని తెలుస్తుంది.

Nayanthara, Trisha to share the screen finally! - Cinereporters English

అయితే నయన్ అవకాశాలు త్రిష కు ఇవ్వడానికి మేకర్స్ వ‌ద్ద స్ట్రాంగ్ కారణాలు ఉన్నాయని తెలుస్తుంది. నయన్ ప్రమోషన్స్ కి రాదు.. డేట్స్ ఇష్యూస్ ఉంటాయి. అలాగే భారీ రెమ్య‌నరేషన్ డిమాండ్ చేస్తుంది. త్రిష మాత్రం నిర్మాతలు చెప్పినట్లు వింటూ ప్రమోషన్స్ లో సందడి చేస్తుంది. దీంతో నయన్‌కు ఇవ్వవలసిన అవకాశాలు కూడా త్రిషకి అందుతున్నాయని తెలుస్తుంది. అలాగే నయన్ ఎప్పుడూ లేడి ఓరియంటెడ్‌ సినిమాలపై ఆసక్తి చూపుతుంది. త్రిష రెండిటినీ కవర్ చేస్తూ సినిమాలో రాణించాలని ప్రయత్నాలు చేస్తుంది. ఈమె రెమ్యూనరేషన్ కూడా కాస్త తక్కువగానే ఉంటుంది. అందుకే నయన్ మైనస్‌లు త్రిష కు మరింత అవకాశాలు రావడానికి తోడ్పడుతున్నాయట.