ఇన్నాళ్లు జూనియర్ ఎన్టీఆర్ టిడిపిని వదిలేశాడు .. టిడిపిని పట్టించుకోలేదు.. బాబాయ్ బాలకృష్ణ అంటే గౌరవం లేదు.. నారా చంద్రబాబు నాయుడు అంటే భక్తి లేదు ..అంటూ నోటికొచ్చిన విధంగా మాట్లాడారు పని పాట లేని బ్యాచ్ అయితే ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పైనే మండిపడుతూ వచ్చేది. తాజాగా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎలక్షన్స్ లో టిడిపికి సపోర్ట్ చేయకపోవడం పై చాలా చాలా దారుణంగా ట్రోల్ చేశారు . అయితే ఫైనల్లీ ఒకే ఒక్క మాటతో అందరి నోర్లు మూయించేసాడు జూనియర్ ఎన్టీఆర్ .
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు – పవన్ కళ్యాణ్ – మోదీ కూటమి ఏ విధంగా ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే . సెన్సేషనల్ రికార్డు దిశగా బ్లాస్టింగ్ పర్ఫామెన్స్ ఇచ్చింది . త్వరలోనే ఏపీలో కూటమి అధికారం చేపట్టబోతుంది. దీనికి సంబంధించి చాలా మంది చంద్రబాబు – పవన్ కళ్యాణ్ లను విష్ చేశారు . రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ సైతం ట్విట్టర్ వేదికగా స్పందించారు. దీంతో ఆయన పేరు ఏపీ రాజకీయాలల్లో మారుమ్రోగిపోతుంది.
ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన లోకేష్ కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి,MPగా గెలిచిన భరత్, పురంధేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని పోస్ట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ని పరోక్షంగా ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు. తన సినిమాల కోసమే జూనియర్ ఎన్టీఆర్ ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటూ ఘాటుగా కౌంటర్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!
ప్రియమైన @ncbn మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.
అద్భుతమైన మెజారిటీతో గెలిచిన @naralokesh కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా…
— Jr NTR (@tarak9999) June 5, 2024